Akkineni Nagarjuna: తెలంగాణ సర్కార్‌కు, మంత్రి కేటీఆర్‌కు నాగ్ స్పెషల్ థ్యాంక్స్

Akkineni Nagarjuna: తెలంగాణ సర్కార్‌కు, మంత్రి కేటీఆర్‌కు నాగ్ స్పెషల్ థ్యాంక్స్

Ram Naramaneni

|

Updated on: Nov 01, 2023 | 5:45 PM

హైదరాబాద్ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన సినిమాటిక్ ఎక్స్‌పోను నాగార్జున లాంఛనంగా ప్రారంభించారు.   ఈ సందర్భంగా నాగ్ కీలక కామెంట్స్ చేశారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ టెక్నాలజీ ఉపయోగించుకొని టాలీవుడ్ ఆస్కార్ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందన్నారు.  సౌత్ ఫిల్మ్స్‌ని.. ఇండియా అంతా ఫాలో అవుతున్నారని నాగ్ తెలిపారు.  హైదరాబాద్ అనేది సినిమా పరిశ్రమకు క్యాపిటల్‌గా మారనుందన్నారు.

హైదరాబాద్ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన సినిమాటిక్ ఎక్స్‌పోను నాగార్జున లాంఛనంగా ప్రారంభించారు.   ఈ సందర్భంగా నాగ్ కీలక కామెంట్స్ చేశారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ టెక్నాలజీ ఉపయోగించుకొని టాలీవుడ్ ఆస్కార్ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందన్నారు.  సౌత్ ఫిల్మ్స్‌ని.. ఇండియా అంతా ఫాలో అవుతున్నారని నాగ్ తెలిపారు.  హైదరాబాద్ అనేది సినిమా పరిశ్రమకు క్యాపిటల్‌గా మారనుందన్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే కలెక్షన్లు మిగతా అన్ని రాష్ట్రాల కలెక్షన్లతో సమానంగా ఉంటాయన్నారు.  ఇంత గొప్ప ఉన్నతికి సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ఐటీ మంత్రి కేటీఆర్, ఐటీ డిపార్ట్‌మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్‌కు నాగార్జున ధన్యావాదాలు తెలిపారు. ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో ఈ సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమం జరిగింది.  సినీమా రంగంలో 24 శాఖల్లో వచ్చిన సరికొత్త సాంకేతికతను ఈ సినిమాటిక్ ఎక్స్‌పోలో ప్రదర్శనకు పెట్టారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి