Salman Khan: తండ్రి కావాలనుకుంటున్న సల్మాన్ ఖాన్.. కానీ పెళ్లి మాత్రం వద్దట..

సినిమా అప్డేట్స్ కంటే ఎక్కువగా సల్మాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లతో సల్లుభాయ్ లవ్, డేటింగ్,బ్రేకప్ వంటి విషయాలే ఫిల్మ్ సర్కిల్లో ఎక్కువగా వినిపించేవి. అయితే ఏనాడు తన ప్రేమ.. పెళ్లి గురించి మాట్లాడని సల్మాన్..

Salman Khan: తండ్రి కావాలనుకుంటున్న సల్మాన్ ఖాన్.. కానీ పెళ్లి మాత్రం వద్దట..
Salman Khan
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 30, 2023 | 2:38 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ముందుండే పేరు సల్మాన్ ఖాన్. పాన్ ఇండియా లెవల్లో భారీ ఫాలోయింగ్ సంపాదిచుకున్న ఈ హీరో.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‎గానే ఉంటున్నాడు. సినిమా అప్డేట్స్ కంటే ఎక్కువగా సల్మాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరలవుతుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లతో సల్లుభాయ్ లవ్, డేటింగ్,బ్రేకప్ వంటి విషయాలే ఫిల్మ్ సర్కిల్లో ఎక్కువగా వినిపించేవి. అయితే ఏనాడు తన ప్రేమ.. పెళ్లి గురించి మాట్లాడని సల్మాన్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ప్రేమలో దురదృష్టవంతుడిని అని.. తనను జాన్ అని పిలవాలనుకున్న అమ్మాయ.. ఇప్పుడు బాయ్ అని పిలుస్తుందంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక అదే ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలను బయటపెట్టారు.

పెళ్లి, పిల్లల గురించి సల్మాన్ మాట్లాడుతూ.. ” నేను ఇప్పుడు మా ఇంటికి కోడలిని కాదు.. పిల్లలను తీసుకోవాలనుకుంటున్నాను. ఓ పాపను దత్తత తీసుకుని పెంచుకోవాలనుకుంటున్నాను. కానీ మన భారతీయ చట్టాలు అందుకు ఒప్పుకుంటాయో లేదో చూడాలి” అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికీ సల్మాన్ పెళ్లంటే తనకు ఇష్టం లేదనే అంటున్నారు.

ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ చాలా మంది హీరోయిన్లతో ప్రేమలో పడ్డారు. కానీ ఏదీ పెళ్లి వరకు రాలేదు. మొదటిసారిగా సల్మాన్ నటి సంగీతా బిజ్లానీతో నిశ్చితార్థం చేసుకున్నారు. 1994లో వీరు వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ పెళ్లికి ఒక నెల ముందు అనుహ్యంగా వీరు విడిపోయారు. ఇటీవల కిసీ కీ జాన్ కిసీ కీ భాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..