AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Lottery Case: బీ టౌన్‌లో మరోసారి ఈడీ టెన్షన్.. ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో రణబీర్ కపూర్, సన్నీలియోన్‌‌తోపాటు వారికి కూడా..

Online Betting App Case: ఇటీవల బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​పంపింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, గేమింగ్ కేసులో విచారణ కోసం త్వరలో నటుడిని పిలవనున్నట్లుగా తెలుస్తోంది. ఈ బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్‌తోపాటు సన్నీ లియోన్, పాకిస్థానీ గాయకుడు అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, బాలీవుడ్ గాయని నేహా కక్కర్, సంగీత స్వరకర్త విశాల్ దద్లానీ పేర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Online Lottery Case: బీ టౌన్‌లో మరోసారి ఈడీ టెన్షన్.. ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో రణబీర్ కపూర్, సన్నీలియోన్‌‌తోపాటు వారికి కూడా..
Sunny Leone And Ranbir Kapoor
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 04, 2023 | 6:47 PM

బాలీవుడ్ తారలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫోకస్ పెట్టింది. తాజాగా బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ పెద్ద సమస్యలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి, ‘మహదేవ్ బుక్’ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు రణబీర్ కపూర్‌తోపాటు పలువు బీ టౌన్ నటులకు ఈడీ సమన్లు జారీ చేసింది. నటుడిని త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉంది.

నిజానికి ఈ విషయంలో రణ్‌వీర్‌ కపూర్‌ పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఆన్‌లైన్ గేమింగ్ యాప్ కేసులో నిందితుడైన సౌరభ్ చంద్రకర్ వివాహానికి నటుడు మహదేవ్ హాజరయ్యారు. హవాలా ద్వారా స్టార్‌లకు డబ్బు ఇచ్చినట్లు సౌరభ్ ఆరోపించారు. ఈ సమన్లు ​​రణ్‌బీర్ కపూర్‌కి విచారణ నిమిత్తం పంపినట్లు సమాచారం. అయితే, ఈ కేసులో రణబీర్ కపూర్ కాకుండా.. ఈడీ రాడార్‌లో ఉన్న ఇతర తారల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ జాబితాలో సన్నీ లియోన్, పాకిస్థానీ గాయకుడు అతిఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, బాలీవుడ్ గాయని నేహా కక్కర్, సంగీత స్వరకర్త విశాల్ దద్లానీ పేర్లు ఉన్నాయి.

దుబాయ్‌లో సౌరభ్ చంద్రకర్ వివాహం..

ఈ ఏడాది ప్రారంభంలో అంటే ఫిబ్రవరిలో మహదేవ్ బుక్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ వివాహం జరిగింది. ఈ వివాహానికి చాలా మంది బాలీవుడ్ తారలు హాజరయ్యారు. సౌరభ్ వివాహం దుబాయ్‌లో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లికి రూ.200 కోట్లు ఖర్చు చేశారు. పెళ్లి వేడుకలో చాలా మంది తారలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు.

ఈ చిత్రంలో రణబీర్ కపూర్ కనిపించనున్నాడు. వర్క్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ.. రణబీర్ కపూర్ త్వరలో ‘యానిమల్’ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్‌తో పాటు నటుడు బాబీ డియోల్ కూడా బలమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 1న సినిమా థియేటర్లలోకి రానుంది. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి