బన్నీకి ఫిదా అయిన బాలీవుడ్ యంగ్ హీరోయిన్.. అల్లు అర్జున్‌తో నటించాలని ఉందంటోన్న బీటౌన్ బ్యూటీ..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇటు తెలుగులోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ
Actress Saiee Manjrekar: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇటు తెలుగులోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ సూపర్ హిట్ సాధించింది. దీంతో బాలీవుడ్లో కూడా బన్నీ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఇప్పటికే తెలుగు, మలయాళం ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.. అయితే బన్నీకి మరో బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కూడా ఫిదా అయిపోయిందంటా.. అవకాశం వస్తే బన్నీతో నటించాలనుందంటూ.. ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్లో ‘దబాంగ్ 3’ మూవీలో సల్మాన్ సరసన హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు పొందింది సాయి మంజ్రెకర్. ప్రస్తుతం ఈ భామ తెలుగులో తెరకెక్కుతున్న మేజర్, గని సినిమాల్లో నటిస్తుంది. తాజాగా సాయి మంజ్రెకర్ బన్నీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. “తెలుగులో నాకు బన్నీ అంటే చాలా ఇష్టం, గత కొన్ని రోజుల నుంచి ఆయనతో నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఒకవేళ అవే నిజమైతే బాగుండు అనుకున్నా. నాకు తెలుగులో మొదటగా అవకాశం రాగనే.. నేను ముందుగా చూసిని తెలుగు సినిమా అల.. వైకుంఠపురంలో. అందులో ఆయన డ్యాన్స్, నటన చూసి పిదా అయిపోయా. బన్నీతో నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తా” అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుండగా.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సుకుమార్. ఈ మూవీని ఆగస్ట్ 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్.
Also Read:
మరో సర్ఫ్రైజ్ ఇచ్చిన ‘ఖిలాడీ’ టీం.. కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్.. వెల్కమ్ చెప్పిన చిత్రయూనిట్..