Sashi Movie : హరీష్ శంకర్ చేతులమీదుగా ‘శశి’ సెకండ్ సాంగ్.. ఆకట్టుకుంటున్న అందమైన పాట..
ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శశి’. సురభి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై
Sashi Movie : ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శశి’. సురభి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. చిత్రాన్ని ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఒకే ఒక లోకం నువ్వు అంటూ సాగే పాట సంచలనం సృష్టిస్తున్న విషయం తేలిసిందే. సంగీత ప్రేమికులను ఈ పాట ఉలలాడిస్తుంది. మిలియల్ వ్యూస్ తో, లైక్స్ తో దూసుకుపోతుంది ఈ పాట. ఇక ఇప్పుడు ఈ సినిమానుంచి సెంకడ్ సాంగ్ ను విడుదలచేసారు. ధీంతానా… ధీంతానా అంటూ సాగే పాటను సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా లాంచ్ చేసారు. అందమైన లిరిక్స్ తో సాగిన ఈపాట ఆకట్టుకుంటుంది. ఇక చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు.