AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Orry: ఓరీ దేవుడో.. ఈ ఒక్క వాచ్ అమ్మితే 20 మంది కోటీశ్వరులు కావొచ్చు.. ధర తెలిస్తే అవాక్కే..

ఇటీవల అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలలో ఓర్రీ చేసిన సందడి గురించి తెలిసిందే. అలాగే కొన్ని రోజుల క్రితం ఓర్రీ.. రూ. 4.3 కోట్ల విలువైన సర్పెంటీ డైమండ్ నెక్లెస్‌ను కొనుగోలు చేశాడు. ఆ నెక్లెస్ ధరించి భిన్నంగా ఫోటోలకు ఫోజులిచ్చి సోషల్ మీడియాలో సెన్సెషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు ఓర్రీ ధరించిన వాచ్ ధర తెలిసి అవాక్కవుతున్నారు ఫ్యాన్స్.

Orry: ఓరీ దేవుడో.. ఈ ఒక్క వాచ్ అమ్మితే 20 మంది కోటీశ్వరులు కావొచ్చు.. ధర తెలిస్తే అవాక్కే..
Orry
Rajitha Chanti
|

Updated on: Jul 20, 2024 | 6:02 PM

Share

సోషల్ మీడియాలో చాలా ఫేమస్ సెలబ్రెటీ ఓర్రీ. బాలీవుడ్ తారలతో అత్యంత క్లోజ్‎గా ఫోటోలకు ఫోజులిచ్చి నెట్టింట చాలా పాపులర్ అయ్యాడు ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవత్రమణి. అతడి జీవితం చాలా విలాసవంతంగా ఉంటుంది. అలాగే ఎప్పుడూ విభిన్నమైన కాస్ట్యూమ్స్, ఫ్యాషన్ సెన్స్‏తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. తరచూ బాలీవుడ్ తారలతో కనిపించి ఈ ఇంటర్నెట్ సంచలనం గత కొన్ని రోజులుగా డిఫరెంట్ ఫ్యాషన్ మోడ్రన్ ఆభరణాలతో స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాడు. ఇటీవల అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలలో ఓర్రీ చేసిన సందడి గురించి తెలిసిందే. అలాగే కొన్ని రోజుల క్రితం ఓర్రీ.. రూ. 4.3 కోట్ల విలువైన సర్పెంటీ డైమండ్ నెక్లెస్‌ను కొనుగోలు చేశాడు. ఆ నెక్లెస్ ధరించి భిన్నంగా ఫోటోలకు ఫోజులిచ్చి సోషల్ మీడియాలో సెన్సెషన్ క్రియేట్ చేశాడు. ఇక ఇప్పుడు ఓర్రీ ధరించిన వాచ్ ధర తెలిసి అవాక్కవుతున్నారు ఫ్యాన్స్.

ఇప్పుడు ఓర్రీ సెర్పెంటి మిస్టిరియోసి హై జ్యువెలరీ సీక్రెట్ వాచ్‌ని ధరించి అందరి దృష్టిలో పడ్డాడు. 18 kt తెలుపు, పసుపు బంగారంతో తయారు చేయబడిన ఈ అద్భుతమైన వాచ్.. కట్ డైమండ్స్, రెండు పియర్ కట్ పచ్చలు, పేవ్ సెట్ డైమండ్ డయల్‌తో సెట్ చేయబడింది. ఈ వాచ్ ధర రూ.20 కోట్లు అని సమాచారం. బీటౌన్స్ బీఎఫ్ఎఫ్ గా పిలువబడే ఓర్రీ భారతదేశ సామాజిక రంగంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఓర్రీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్ పర్సన్ కార్యాలయంలో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతను న్యూయార్క్‌లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి ఫైన్ ఆర్ట్స్, కమ్యూనికేషన్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. ప్రస్తుతం ఓర్రీకి ఇన్ స్టాలో 1.4 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. సినిమా ప్రీమియర్స్, ఫోటోషూట్స్ అంటూ నెట్టింట తెగ సందడి చేస్తుంటాడు. ప్రతిభ కష్టపడి పనిచేయన్పుడు కష్టపడి ప్రతిభను కొట్టేస్తుంది అని అతడి బయోలో కనిపిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.