Urmila Matondkar: ఊర్మిళకు కొవిడ్‌ పాజిటివ్‌.. వైరస్‌ను తేలికగా తీసుకోవద్దని ఫ్యాన్స్‌కు పిలుపు..

ప్రముఖ బాలీవుడ్‌ నటి శివసేన నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్‌ కరోనా బారిన పడింది. ఈ మేరకు ఆమే ట్విట్టర్‌ ద్వారా ఈ విషయం తెలిపింది

Urmila Matondkar: ఊర్మిళకు కొవిడ్‌ పాజిటివ్‌.. వైరస్‌ను తేలికగా తీసుకోవద్దని ఫ్యాన్స్‌కు పిలుపు..
Follow us
Basha Shek

|

Updated on: Nov 01, 2021 | 9:24 AM

ప్రముఖ బాలీవుడ్‌ నటి శివసేన నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్‌ కరోనా బారిన పడింది. ఈ మేరకు ఆమే ట్విట్టర్‌ ద్వారా ఈ విషయం తెలిపింది. ‘ కొవిడ్‌ తేలిక పాటి లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకున్నాను. ఫలితాల్లోపాజిటివ్‌ అని తేలింది. దీంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. ప్రస్తుతం నేను హోమ్‌ క్వారంటైన్‌లో క్షేమంగానే ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ వెంటనే పరీక్షలు చేయించుకోండి. మరికొన్ని రోజుల్లో దీపావళి పండగ రానుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించండి’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది ఊర్మిళ.

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో షూటింగులతో చిత్ర పరిశ్రమ మళ్లీ కళకళలాడుతోంది. అదేవిధంగా పెద్ద పెద్ద సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా తారలు వరసగా కరోనా బారిన పడడం కొంచెం ఆందోళన కలిగిస్తోంది. మొన్న టాలీవుడ్‌ ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ కొవిడ్‌ బారిన పడగా, నిన్న బాలీవుడ్‌ బ్యూటీ నిషా రావల్‌కు కరోనా సోకింది. తాజాగా రంగీలా కొవిడ్‌ బాధితులచేరిపోయింది. ఈ మేరకు ‘రంగీలా బ్యూటీ’ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Also Read

Happy Birthday Ileana D’Cruz: అందాల పూదోటలాంటి అపరంజి ఈ వయ్యారి.. నేడు ఇలియానా పుట్టిన రోజు..

Aishwarya Rai Birthday: దేవకన్యలకే కన్నుకుట్టే రూపం.. ప్రకృతే పరవశించే సోయగం.. ఐశ్వర్య అందం పొగడతరమ..

Rajinikanth: రజనీ అభిమానులకు శుభవార్త..ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన సూపర్‌ స్టార్..

పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్