Rajinikanth: రజనీ అభిమానులకు శుభవార్త..ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన సూపర్‌ స్టార్..

రజనీకాంత్‌ అభిమానులకు శుభవార్త.. ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ డిశ్చార్జి అయ్యారు.

Rajinikanth: రజనీ అభిమానులకు శుభవార్త..ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన సూపర్‌ స్టార్..
Follow us
Basha Shek

|

Updated on: Nov 01, 2021 | 7:47 AM

రజనీకాంత్‌ అభిమానులకు శుభవార్త.. ఇటీవల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ డిశ్చార్జి అయ్యారు. వైద్యుల సూచనల మేరకు ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. అయితే రజనీ ఆస్పత్రి నుంచి బయటకు రావడానికి ముందే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ సూపర్‌స్టార్‌ను పరామర్శించారు. స్టాలిన్‌ రజనీ బాగోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సినీ కళామతల్లికి రజనీ చేసిన సేవలను గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారంతో గౌరవించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే అస్వస్థతకు గురైన సూపర్‌ స్టార్‌ను ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో తమ అభిమాన నటుడికి ఏమైందోనని ఫ్యాన్స్‌ ఆందోళన చెందారు. రజనీకాంత్‌ మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ గుర్తించామని, అందుకు సరైన చికిత్స చేశామని వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Also read:

Vargin Story Movie Teaser: సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ‘వర్జిన్ స్టోరి’ మూవీ టీజర్..

Rajamouli: ఆర్‌.ఆర్‌.ఆర్‌లో ఎన్టీఆర్‌ను అలా చూపిస్తే అభిమానులు ఊరుకుంటారా.? ఆసక్తికర విషయాలు వెల్లడించిన జక్కన్న..

Yashika Aannand : సరదాలకు పోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్న యాషిక కోలుకుంటుంది.. కానీ

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌