AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే ఈ టెస్టులు క్లియర్ చేయాల్సిందే.. ఆసక్తికర విషయాలు చెప్పిన దివి

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాలంటే సామాన్యులకు అగ్ని పరీక్ష కాంటెస్ట్ ఉంది. మరి సెలబ్రిటీలకు ఎలాంటి టెస్టులు ఉండవా? అంటే కచ్చితంగా ఉంటాయంటోంది మాజీ కంటెస్టెంట్ దివి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె బిగ్ బాస్ షో గురించి పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టింది.

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే ఈ టెస్టులు క్లియర్ చేయాల్సిందే.. ఆసక్తికర విషయాలు చెప్పిన దివి
Bigg Boss Telugu 10
Basha Shek
|

Updated on: Oct 07, 2026 | 9:43 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే విజయవంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఐదో వారం కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కూడా ఉన్నారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ద్వారా కామనర్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. .మరి మరి బిగ్ బాస్ హౌస్ లోకి రావాలంటే సెలబ్రిటీలకు కూడా టెస్టులు ఉంటాయా? ఉంటే ఎలాంటి టెస్టులు ఉంటాయి? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాలంటే సెలబ్రిటీలకు కూడా కొన్ని టెస్టులు ఉంటాయని, ఆ టెస్టు పాస్ అయితేనే వారిని హౌస్ లోకి పంపిస్తారని బిగ్ బాస్ వెనుక నిజాలను బయటపెట్టింది మాజీ కంటెస్టెంట్, ప్రముఖ నటి దివి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో పాల్గొన్న ఆమె తన ఆట, మాట తీరుతో అందరి దృష్టిని ఆకర్షించింది. విజేతగా నిలవకపోయినా తన ముక్కుసూటితనంతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. తాజాగా ఓ ఛాట్ షోకు హాజరైన ఆమె బిగ్ బాస్ రియాలిటీ షో గురించి, అందులో తన ప్రయాణం, ఆ తర్వాత కెరీర్ పరంగా వచ్చిన మార్పులపై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అందులో భాగంగానే బిగ్ బాస్ లోకి వెళ్లే ముందు ఏం అడిగారు? ఏ ఏ టెస్టులు ఉంటాయి ? అనే విషయాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది దివి.

‘ మొదట కొన్ని ఫొటోలు చూశారు. ఆ తర్వాత ఒక మూడు, నాలుగు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీడియో కాల్ లో ముగ్గురు, నలుగురు ఒకేసారి మాట్లాడుతారు. అది కాకుండా మళ్లీ ఒక డాక్టర్ మనతో ప్రత్యేకంగా మాట్లాడతారు. మన మెంటల్ కండిషన్ ఎలా ఉంది ? అనే విషయం చూస్తారు. ఆ తర్వాత ఫిజికల్ గా బాడీ టెస్టులు కూడా జరుగుతాయి. మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది? అనే విషయాన్ని కూడా చూస్తారు. ముఖ్యంగా బీపీ, షుగర్ తో పాటు మెంటల్ టెస్ట్ కూడా చేస్తారు. మీరు హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఏదైనా గొడవ పెట్టుకుంటారా? లేక స్టేబుల్ గా ఉంటారా? లేదా మరేదైనా అనారోగ్య సమస్య వస్తుందా ? అనే విషయాలన్నింటినీ ముందుగా చెక్ చేస్తారు. ఈ టెస్టులన్నీ క్లియర్ చేసిన తర్వాతే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ దొరుకుతుంది’ అని చెప్పుకొచ్చింది దివి. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ బ్యూటీ చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే ఇన్ని టెస్టులు పాస్ అవ్వాలా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ తెలుగు సీజన్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us