AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DMartకి రూ.1000 బడ్జెట్‌తో వెళ్తే బిల్లు రూ.3000 ఎలా అవుతుంది? చాలా మంది చేసే పొరపాటు ఇదే!

DMart: పిల్లలతో కలిసి సూపర్‌మార్కెట్‌కు వెళ్లినప్పుడు బొమ్మలు, చాక్లెట్లు, స్నాక్స్ వంటి వాటిని చూసి అదనపు కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే బడ్జెట్, షాపింగ్ లిస్ట్ నిర్ణయించుకోవడం మంచిది. మొత్తానికి సూపర్‌మార్కెట్‌లో డిస్కౌంట్ కనిపించడం తప్పు కాదు. కానీ..

DMartకి రూ.1000 బడ్జెట్‌తో వెళ్తే బిల్లు రూ.3000 ఎలా అవుతుంది? చాలా మంది చేసే పొరపాటు ఇదే!
Dmart Shopping
Subhash Goud
|

Updated on: Oct 07, 2026 | 9:13 PM

Share

DMart: సూపర్‌మార్కెట్‌లో షాపింగ్ చేయడానికి వెళ్లినప్పుడు చేతిలో ఉన్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు కావడం చాలామందికి ఎదురయ్యే సమస్య. ఇంట్లో అవసరమైన సరుకుల కోసం రూ.1000తో వెళ్లి.. చివరికి బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి రూ.2000, రూ.3000 దాటిన సందర్భాలు కూడా ఉంటాయి. దీనికి కేవలం ఎక్కువ ధరలు కారణం కాదు. షాపింగ్ చేసే విధానం, వస్తువుల అమరిక, డిస్కౌంట్ ఆఫర్లు, మన కొనుగోలు అలవాట్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. షాపింగ్‌ చేసేవారు ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోరు. ఇంకా డీమార్ట్‌కు వెళితే ఎక్కువ బిల్లు అవుతుందని పైగా నిందిస్తుంటారు. సరైన విధానాన్ని అనుసరించి షాపింగ్‌ చేస్తే అనుకున్న బడ్జెట్‌లోనే పూర్తి చేసుకుని ఇంటికి రావచ్చు.

అసలు బిల్లు ఎందుకు పెరుగుతుంది?

బియ్యం, పప్పులు, నూనె, పంచదార వంటి అవసరమైన వస్తువులు కొనడానికి సూపర్‌మార్కెట్‌కు వెళ్తాం. కానీ అక్కడ ఒకే చోట బిస్కెట్లు, చాక్లెట్లు, షాంపూలు, దుస్తులు, ఇంటి అవసరాల వస్తువులు ఇలా ఎన్నో రకాల ఉత్పత్తులు కనిపిస్తాయి. దీంతో ముందుగా కొనాలని అనుకోని వస్తువులు కూడా మన కార్ట్‌లో చేరిపోతాయి. ముఖ్యంగా ‘డిస్కౌంట్’, ‘ఆఫర్’, ‘తక్కువ ధర’ వంటి బోర్డులు కనిపిస్తే అవసరం లేకపోయినా కొనాలనే ఆలోచన కలుగుతుంది. ఆఫర్‌లో వస్తున్నాయి కదా.. 50 డిస్కౌంట్‌ ఉంది కదా అని వెంటనే కొనేస్తుంటాము. అక్కడే అసలైన పొరపాటు వస్తుంది.

రూ.10 ఆదా చేయాలని చూసి రూ.100 ఖర్చు:

ఉదాహరణకు ఇంట్లో ఇప్పటికే రెండు సబ్బులు ఉన్నాయని అనుకుందాం. మరో సబ్బు అవసరం లేకపోయినా తక్కువ ధరకు వస్తుందని నాలుగు సబ్బులు కొనుగోలు చేస్తే.. డిస్కౌంట్ వల్ల డబ్బు ఆదా అయినట్టు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అవసరం లేని వస్తువుపై అదనంగా డబ్బు ఖర్చవుతుంది. ఇదే విధంగా ఒక చిన్న ఆఫర్ చూసి బిస్కెట్లు, చాక్లెట్లు, స్నాక్స్ లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేస్తూ పోతే.. చివరికి బిల్లు భారీగా పెరిగిపోతుంది.

ఇది కూడా చదవండి: Big Sale: రూ.6 వేలకే 200 ఇంచుల స్క్రీన్.. మీ ఇంటినే థియేటర్‌గా మార్చేసే ఆఫర్!

దీన్నే ‘ఇంపల్స్ బైయింగ్’ అంటారు

సూపర్‌మార్కెట్లలో వస్తువులను ఒక నిర్దిష్ట విధానంలో అమర్చడం కూడా వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్, ఆఫర్లు, డిస్కౌంట్ బోర్డులు, కొత్త ఉత్పత్తులు వంటివి కనిపించడంతో వెంటనే కొనాలనే ఆసక్తి కలుగుతుంది. అవసరం లేకపోయినా అప్పటికప్పుడు తీసుకునే ఈ రకమైన కొనుగోళ్లను ‘ఇంపల్స్ బైయింగ్’ అని అంటారు. దీని బిజినెస్‌ ట్రిక్‌ అనే చెప్పాలి.

ఇది కూడా చదవండి: Gold Silver Price: 10 ఏళ్ల క్రితం బంగారం, వెండి ధరలు ఎంత? ఇప్పుడు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!

షాపింగ్‌కు వెళ్లే ముందు ఈ పని చేయండి

డబ్బు ఆదా చేయాలంటే సూపర్‌మార్కెట్‌కు వెళ్లే ముందు మొబైల్‌లో అవసరమైన వస్తువుల జాబితాను తయారు చేసుకోవడం మంచిది.

ఉదాహరణకు:

  • బియ్యం
  • పప్పు
  • నూనె
  • పంచదార
  • సబ్బు
  • షాంపూ

ఇలా ముందుగానే లిస్ట్ తయారు చేసుకుని.. దానిలో ఉన్న వస్తువులనే కొనడానికి ప్రయత్నించాలి. చాలా అవసరమైతే తప్ప లిస్ట్‌లో లేని వస్తువులను కార్ట్‌లో వేయకపోవడం మంచిది.

డిస్కౌంట్ కనిపిస్తే వెంటనే కొనొద్దు:

‘ఆఫర్ ఉంది కాబట్టి కొనాలి’ అనే ఆలోచనకు బదులుగా ‘ఇది నాకు నిజంగా అవసరమా?’ అని ముందుగా ప్రశ్నించుకోవాలి. కొనుగోలు చేసే ముందు అదే వస్తువు ధరను సమీపంలోని ఇతర దుకాణాల్లో లేదా ఆన్‌లైన్‌లో ఒకసారి పరిశీలించడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. రూ.100 ఆదా చేయాలనే ఉద్దేశంతో అవసరం లేని వస్తువులపై రూ.500 ఖర్చు చేస్తే.. అది అసలు పొదుపు కాదని గుర్తుంచుకోవాలి.

పిల్లలతో షాపింగ్‌కు వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త:

పిల్లలతో కలిసి సూపర్‌మార్కెట్‌కు వెళ్లినప్పుడు బొమ్మలు, చాక్లెట్లు, స్నాక్స్ వంటి వాటిని చూసి అదనపు కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే బడ్జెట్, షాపింగ్ లిస్ట్ నిర్ణయించుకోవడం మంచిది. మొత్తానికి సూపర్‌మార్కెట్‌లో డిస్కౌంట్ కనిపించడం తప్పు కాదు. కానీ డిస్కౌంట్ పేరుతో అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం వల్లే నెలవారీ బడ్జెట్ దెబ్బతింటుంది. అందుకే లిస్ట్ ప్రకారం షాపింగ్ చేయడం, ధరలను పోల్చడం, అవసరమైన వస్తువులకే ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఖర్చును గణనీయంగా నియంత్రించుకోవచ్చు. ఈ విషయాలు అందరికి తెలిసిందే. కానీ డీమార్ట్‌కు వెళ్లిన తర్వాత ఆఫర్లు, డిస్కౌంట్లను చూసి అదనపు ఖర్చును మీదేసుకుంటారు.

ఇది కూడా చదవండి: Indian Railways: పండగ రద్దీకి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్.. ఈ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్‌..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us