AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో రెండు కొత్త స్కూటర్లతో దూసుకొస్తున్న Aprilia.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే

ప్రీమియం స్కూటర్ మార్కెట్లో Aprilia మరోసారి తన ప్రత్యేకతను చూపించేందుకు సిద్ధమైంది. SXR GT 125, SXR GT 175 పేర్లతో రెండు కొత్త మ్యాక్సీ స్కూటర్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు పెద్ద వీల్స్, మెరుగైన ఫీచర్లు, వేర్వేరు ఇంజిన్ ఆప్షన్లను అందిస్తోంది. రూ.1.11 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ కొత్త సిరీస్‌పై ఇప్పటికే ఆసక్తి పెరుగుతోంది.

మరో రెండు కొత్త స్కూటర్లతో దూసుకొస్తున్న Aprilia.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే
Aprilia Sxr Gt 125 And 175
Nikhil
|

Updated on: Oct 07, 2026 | 9:40 PM

Share

గతంలో SXR 125, SXR 160 మోడళ్లతో భారత మార్కెట్లో గుర్తింపు తెచ్చుకున్న Aprilia, ఇప్పుడు SXR GT సిరీస్‌ను తిరిగి తీసుకొచ్చింది. కొత్త SXR GT 125, SXR GT 175లో పాత డిజైన్‌ను కొనసాగిస్తూనే అవసరమైన అప్‌డేట్లు చేసింది. ముఖ్యంగా 14 అంగుళాల వీల్స్, కనెక్టెడ్ ఫీచర్లు, మెరుగైన భద్రతా సదుపాయాలు ఈ స్కూటర్లను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

రెండు ఇంజిన్ ఆప్షన్లు..

Aprilia SXR GT 125లో 124.5cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 10.6hp పవర్, 10.4Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. SXR GT 175లో 174.7cc ఇంజిన్ ఉండగా, 13.3hp పవర్, 14.1Nm టార్క్ అందిస్తుంది. రెండు మోడళ్లు E20 పెట్రోల్‌కు అనుకూలంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా ఈ స్కూటర్లకు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

ఈ సిరీస్‌లో 14 అంగుళాల వీల్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. పాత SXR మోడళ్లలో 12 అంగుళాల వీల్స్ ఉండగా, కొత్త స్కూటర్లలో పెద్ద వీల్స్‌ను తీసుకొచ్చారు. ఇవి రహదారిపై మెరుగైన స్థిరత్వం, సౌకర్యవంతమైన రైడింగ్‌కు ఉపయోగపడే అవకాశం ఉంది. రెండు మోడళ్లను SR 125, SR 175తో పంచుకునే ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు.

175లో TFT..

SXR GT 175లో 5 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంది. Bluetooth ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకుని మ్యూజిక్, కాల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. టర్న్-బై-టర్న్ నావిగేషన్, అదనపు హ్యాండిల్‌బార్ కంట్రోల్స్, సింగిల్ ఛానల్ ABS కూడా ఇందులో ఉన్నాయి. అయితే SXR GT 125లో 5 అంగుళాల LCD క్లస్టర్, CBS భద్రతా వ్యవస్థ లభిస్తాయి. 125లో TFT, Bluetooth సదుపాయాలు అందించలేదు.

ధర విషయానికి వస్తే SXR GT 125 ధర రూ.1.11 లక్షలు కాగా, SXR GT 175 ధర రూ.1.31 లక్షలుగా నిర్ణయించారు. ఈ ధరలు ఎక్స్-షోరూమ్. పాత SXR లైనప్‌ను తిరిగి తీసుకొచ్చిన Aprilia, కొత్త ఫీచర్లు, పెద్ద వీల్స్‌తో ప్రీమియం స్కూటర్ విభాగంలో పోటీని పెంచే ప్రయత్నం చేసింది.

Follow Us