AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు.. కానీ హిట్స్ మాత్రం రెండే.! ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ హావ నడుస్తుంది. సినిమా సినిమాకు కొత్త భామలు ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నటున్నారు. కొంతమంది భామలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతుంటే మరికొంతమంది స్టార్స్ అవ్వడం కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా సక్సెస్ అందుకోలేకపోతున్నారు

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు.. కానీ హిట్స్ మాత్రం రెండే.! ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 07, 2026 | 8:02 PM

Share

పాయల్ రాజ్‌పుత్‌కు ఆఫర్లు తగ్గాయా? ఒకే ఒక్క సినిమాతో స్టార్‌గా మారి.. ఇప్పుడు మళ్లీ గట్టిగా ప్రయత్నిస్తున్న ఈ హీరోయిన్ తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు పాయల్ రాజ్‌పుత్. అందం, గ్లామర్‌తో పాటు నటనతోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. కెరీర్ ప్రారంభంలోనే భారీ సక్సెస్‌ను అందుకుంది. అయితే ఆ తర్వాత అదే స్థాయిలో వరుస విజయాలను అందుకోలేకపోయింది. దీంతో ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా కనిపించిన పాయల్.. ఇప్పుడు ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. పాయల్ రాజ్‌పుత్ కెరీర్‌ను ‘ఆర్ 100’కు ముందు.. ఆ తర్వాత అని చెప్పుకోవచ్చు. 2018లో అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకోవడంతో పాయల్ ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇందులో ఆమె పోషించిన ఇందు పాత్ర ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసింది. ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో పాయల్ చూపించిన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. పాయల్ కూడా పలుమార్లు ‘ఆర్ 100’ తన జీవితాన్ని మార్చేసిన సినిమా అని చెప్పుకొచ్చింది. ‘ఆర్100’ తర్వాత పాయల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాలను అందించలేకపోయాయి. ‘సీత’, ‘ఆర్ డీ ఎక్స్ లవ్’, ‘వెంకీ మామ’, ‘డిస్కో రాజా’, ‘అనగనగా ఓ అతిధి’, ‘తీస్ మార్ ఖాన్’, ‘జిన్నా’, ‘మయా పేటిక’, ‘రక్షణ’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ.. ‘ఆర్ ఎక్స్ 100’ స్థాయి ఇంపాక్ట్ మాత్రం మరోసారి రాలేదు.

ఆర్ 100 తర్వాత పాయల్‌కు మరోసారి బలమైన గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ‘మంగళవారం’. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో షైలుగా ఆమె చాలా విభిన్నమైన పాత్రను పోషించింది. ఈ పాత్ర కోసం మానసికంగా, భావోద్వేగంగా చాలా కష్టపడాల్సి వచ్చిందని పాయల్ స్వయంగా చెప్పింది. ‘మంగళవారం’ తన కెరీర్‌లో మరో ముఖ్యమైన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ద్వారా తాను కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాదని పాయల్ నిరూపించుకునే ప్రయత్నం చేసింది.  కానీ స్టార్ హీరోయిన్ స్థాయిలో వరుసగా భారీ కమర్షియల్ సినిమాలు, పెద్ద హీరోల సరసన అవకాశాలు రావడం మాత్రం తగ్గింది. దీనిపై గతంలో పాయల్ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘ఆర్100’లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయడం వల్ల ప్రేక్షకులు, దర్శకులు తనను అదే తరహా పాత్రల్లో ఊహించి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడింది. తాను అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నానని, ఇంకా తనకు చాలా దూరం వెళ్లాల్సి ఉందని చెప్పింది. రీసెంట్ గా లీడర్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు.. కానీ హిట్స్ మాత్రం రెండే.!
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు.. కానీ హిట్స్ మాత్రం రెండే.!
ఫెస్టివ్ సీజన్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ సింపుల్ టిప్స్‌తో
ఫెస్టివ్ సీజన్‌లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ సింపుల్ టిప్స్‌తో
ఓటీటీలో మరో మలయాళం మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అరెరె చికెన్ 65 పేరు వెనక ఇంత పెద్ద కథ ఉందా..
అరెరె చికెన్ 65 పేరు వెనక ఇంత పెద్ద కథ ఉందా..
శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రాకింగ్ మంచు మనోజ్
శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న రాకింగ్ మంచు మనోజ్
ఇక రూ.6 వేలకే మీ ఇల్లు సినిమా థియేటర్.. స్పెషల్ ఆఫర్
ఇక రూ.6 వేలకే మీ ఇల్లు సినిమా థియేటర్.. స్పెషల్ ఆఫర్
ఓరీ దేవుడో.. 2 గంటల జర్నీలో..20 కి.మీ. భారీ ట్రాఫిక్ జామ్!
ఓరీ దేవుడో.. 2 గంటల జర్నీలో..20 కి.మీ. భారీ ట్రాఫిక్ జామ్!
అయ్యో పాపం.. జారుడుబండలో షర్టు ఇరుక్కుని 13 ఏళ్ల బాలుడు మృతి
అయ్యో పాపం.. జారుడుబండలో షర్టు ఇరుక్కుని 13 ఏళ్ల బాలుడు మృతి
వీరి కుటుంబాల్లో నెలంతా సుఖసంతోషాలే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
వీరి కుటుంబాల్లో నెలంతా సుఖసంతోషాలే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
సాక్స్‌లో బిర్యానీ ఆకు పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?