AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Na Wife Missing Teaser: అదరగొట్టిన వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్.. నా వైఫ్ మిస్సింగ్ టీజర్ రిలీజ్

కొత్త బంగారు లోకం జోడీ మళ్లీ కలిసి కనిపించనుందనే వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ జంటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. తాజాగా నా వైఫ్ మిస్సింగ్ టీజర్ విడుదలైంది.

Na Wife Missing Teaser: అదరగొట్టిన వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్.. నా వైఫ్ మిస్సింగ్ టీజర్ రిలీజ్
Naa Wife Missing
Rajeev Rayala
|

Updated on: Oct 07, 2026 | 8:16 PM

Share

ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్ స్క్రైబర్స్ ను ఎంగేజ్ చేస్తోన్న ఆహా ఓటీటీ ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ సిరీస్ ను మన ముందుకు తీసుకొస్తోంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రధాన పాత్రల్లో ఆహా ఒరిజినల్ నా వైఫ్ మిస్సింగ్ ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉండనుంది. నా వైఫ్ మిస్సింగ్ సిరీస్ ను లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై శివ కంఠంనేని నిర్మించారు. స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు.

ఈ రోజు నా వైఫ్ మిస్సింగ్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే – పెద్దలు కుదిర్చిన సంబంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు వరుణ్, శ్వేతా. వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతూ ఉంటుంది. కానీ టీజర్ లో పెళ్లిచూపుల సమయంలోనే తను వర్జిన్ కాదు అని హీరోయిన్ చెప్పడంతో హీరో షాక్ కు గురైనట్లు చూపించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో తన వైఫ్ మిస్ అయినట్లు వరుణ్ కంప్లైంట్ ఇవ్వడం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. పెళ్లి చూపుల సమయంలో శ్వేత చెప్పింది నిజమేనా, ఆమె మిస్సింగ్ కు కారణాలు ఏంటి, వరుణ్ పోలీసుల సహాయంతో తన భార్య ఎక్కడుందో తెలుసుకోగలిగాడా అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ ఆకట్టుకుంటోంది.

కొత్త బంగారు లోకం సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ జంట.. ఇప్పుడు మరోసారి వెండితెరపై కలిసి కనిపించేందుకు సిద్ధమవుతోంది. కొత్త బంగారు లోకంలో వీరిద్దరి కెమిస్ట్రీ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా యువతకు ఈ జోడీ బాగా కనెక్ట్ కావడంతో, వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్‌లకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ మరోసారి ఒకే సినిమాలో కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..