Bigg Boss 5 Telugu: ఇదేం క్రేజ్‌రా మావా.. ప్రియాంకా సింగ్‌కు ఫ్యాన్స్ చేసిన వెల్‌కం సందడి ఎలా ఉందో చూడండి..
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచితే.. షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్‌కి సెలబ్రిటీ హోదాను అమాంతం పెంచేస్తోంది. బిగ్‌బాష్ హౌజ్‌లోకి వెళ్లక ముందు అంతగా పాపులారిటీ లేని వారు...
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచితే.. షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్‌కి సెలబ్రిటీ హోదాను అమాంతం పెంచేస్తోంది. బిగ్‌బాష్ హౌజ్‌లోకి వెళ్లక ముందు అంతగా పాపులారిటీ లేని వారు కూడా షో నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎక్కడ లేని క్రేజ్‌ను పొందుతున్నారు. తాజాగా అలాంటి క్రేజ్‌ను దక్కించుకుంది బిగ్‌బాగ్ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్. మొదట్లో ఎక్కువ రోజులు షోలో కంటిన్వ్యూ అవుతుందా అని అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎక్కువ కాలం షోలో కొనసాగింది. ఇలా ఏకంగా టాప్7లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ 5వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. హౌజ్‌లో ప్రస్తుతం సన్నీ, మానస్, శ్రీరామచంద్ర, షణ్ముఖ్, సిరి, కాజల్ మాత్రమే ఇంట్లో ఉన్నారు.ఈ వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయితే.. మిగిలిన ఐదుగురిలో ఒకరు విజేతగా నిలుస్తారు.
ఇదిలా ఉంటే ఆదివారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యిన ప్రియాంకకు ఫ్యాన్స్ భారీ ఎత్తున వెల్ కమ్ చెప్పారు. బంజారాహిల్స్‌లో ఉన్న ఆమె నివాసానికి చేరుకునే క్రమంలో దారంతా ప్రియాంకకు తన ఇంటి వద్ద భారీ ఎత్తున డీజేతో వెల్ కమ్ చెప్పారు. ప్రియాంకకు వెల్ కం చెప్పేందుకు బిగ్‌బాస్ హౌజ్ మేట్ జెస్సీ సైతం అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. దీంతో ఒకానక సమయంలో ప్రియాంక ఎమోషనల్‌కు గురైంది. దారి పొడవుగా పూలు జల్లుతూ.. పూల దండలేస్తూ.. హంగామా చేస్తూ.. పింకీ అని నినాదాలు చేస్తూ.. హారతులిచ్చారు. మరి బిగ్‌బాస్ హౌజ్ నుంచి వచ్చిన తర్వాత ప్రియాంకకు ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.
Crime News: గన్నుతో పదో తరగతి విద్యార్థి హల్‌చల్.. ప్రిన్సిపాల్‌నే చంపబోయాడు.. ఎందుకంటే..?