AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా తనతో కాఫీ డేట్‌కు వెళ్లాలి..! మనసులో మాట బయటపెట్టిన దివి

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మల్లో దివి ఒకరు. బిగ్ బాస్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది వయ్యారి భామ దివి. బిగ్ బాస్ కంటే ముందు దివి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది .

అతనంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా తనతో కాఫీ డేట్‌కు వెళ్లాలి..! మనసులో మాట బయటపెట్టిన దివి
Divi
Rajeev Rayala
|

Updated on: Feb 04, 2026 | 4:12 PM

Share

బిగ్ బాస్ గేమ్ షో ద్వారా పాపులర్ అయినా ముద్దుగుమ్మల్లో దివి ఒకరు. ఈ అందాల భామ పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది దివి. ఆ క్రేజ్ తోనే ఈ చిన్నది బిగ్ బాస్ షోలో ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ లో తన గేమ్ తో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ రాలేదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ చిన్నది. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఆకట్టుకుంటుంది. లగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను కవ్విస్తుంది దివి. కాగా దివి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతంలో ఒక ఇంటర్వ్యూలో దివి మాట్లాడుతూ.. పలువురు టాప్ హీరోల గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ పట్ల తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని పంచుకుంది. మిర్చి చిత్రం చూసినప్పటి నుండి ప్రభాస్‌కు తాను వీరాభిమానిగా మారానని, ఆ తర్వాత బాహుబలి వంటి చిత్రాలతో ఆయన పట్ల తన అభిమానం మరింత పెరిగిందని దివి చెప్పుకొచ్చింది. ప్రభాస్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పంపినట్లు గుర్తు చేసుకుంది దివి. అప్పట్లో తన మెసేజ్ ఆయన దృష్టికి వెళ్తుందో లేదో అనే డౌట్  ఉన్నప్పటికీ, తన అభిమానాన్ని వ్యక్తం చేయడానికి సాహసించినట్లు తెలిపింది దివి. చాలా మంది అభిమానుల్లాగే ఒక్కసారి ప్రభాస్‌ను చూడాలని, కలవాలని తాను కూడా కోరుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ప్రభాస్‌ను వ్యక్తిగతంగా కలవాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేస్తూ, ఆయనతో ఓ డిసెంట్ కాఫీ డేట్‌కు వెళ్లాలని దివి చెప్పుకొచ్చింది.

ప్రభాస్ ఇంటికి వచ్చిన అతిథులను చాలా ఆప్యాయంగా చూసుకుంటారని, ఆయన ఆతిథ్యం అద్భుతంగా ఉంటుందని తాను విన్నానని తెలిపింది. తన డ్రీమ్ డేట్ ఒక కూల్ కాఫీతో మొదలవ్వాలని, ప్రభాస్‌తో కూర్చుని మనసువిప్పి మాట్లాడాలని ఉందని మనసులో మాట బయట పెట్టింది. ఈ కోరిక నెరవేరాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చింది దివి. అలాగే మిగతా హీరోల గురించి మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌ను గొప్ప డాన్సర్‌గా, పర్ఫెక్షనిస్ట్‌ అని తెలిపింది. రామ్ చరణ్ చిరుత నుండి రంగస్థలం వరకు చేసిన ప్రయాణాన్ని  అద్భుతమని తెలిపింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టంగా భావించి, ఆయన నుంచి చాలా నేర్చుకున్నా అని తెలిపింది. నానిని నేచురల్ స్టార్ అని పేర్కొంటూ, ఆయన నటనలో సహజత్వం తనకెంతో నచ్చుతుందని తెలిపింది. ఎన్టీఆర్‌ను అల్టిమేట్ పెర్ఫార్మర్‌గా, డబ్బింగ్, నటన, డాన్స్‌లో అత్యున్నత స్థాయిని సాధించిన వ్యక్తి అని తెలిపింది. చివరగా, ప్రేమ, డేటింగ్, వివాహం వంటి విషయాలపై నటుల పేర్లను ప్రస్తావించినప్పుడు ఎప్పటినుంచో నాగార్జునను అభిమానిస్తున్నప్పటికీ, డేటింగ్ కోసం ప్రభాస్‌ను ఎంచుకుంటానని దివి తెలిపింది. వివాహం విషయానికి వస్తే, పెళ్లి కాని హీరోలలో ప్రభాస్ లేదా రామ్‌లలో ఎవరినైనా ఎంచుకుంటానని దివి మనసులో మాట బయట పెట్టింది.

ఇవి కూడా చదవండి

Prabhas

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..