AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంబీఏ స్టూడెంట్.. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ.. గెలుపు కోసం..

రాజకీయాలంటే కేవలం అనుభవజ్ఞుల ఇలాకా కాదు.. అది సమాజ సేవకు యువతకు దొరికిన అద్భుతమైన వేదిక అని నేటి తరం నిరూపిస్తోంది. లక్షల జీతాలు వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, ఉన్నత చదువులను పక్కనపెట్టి.. వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు యువత ఉత్సాహం చూపిస్తోంది. తాజాగా ఎంబీఏ చదివిన చౌదరి సుచరిత మున్సిపాలిటీ ఎన్నికల బరిలో నిలిచింది.

Telangana: మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంబీఏ స్టూడెంట్.. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ.. గెలుపు కోసం..
Mba Student Contesting In Municipal Polls
P Shivteja
| Edited By: |

Updated on: Feb 04, 2026 | 3:57 PM

Share

రాజకీయల్లోకి రావాలి అంటే ఒకప్పుడు అనుభవం, అంగబలం, అర్థబలం ఉన్నవారే వస్తారు అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎన్నికలు ఏవీ అయిన సరే యువత బరిలో నిలిచి గెలుస్తున్నారు. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల యువత పోటీ చేసి గెలిచి తమ సత్తా చూపించారు. కాగా ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున్న యువత పోటీలో ఉంటున్నారు. పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారు.. విదేశాల్లో లక్షల జీతాలు వద్దు అనుకుని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. ప్రజలకు సేవ చేయాలనే తపనతో వార్డు కౌన్సిలర్లుగా పోటీకి సై అంటున్నారు. తాజాగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎంబీఏ చదివిన విద్యార్థిని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు..

రామాయంపేట మున్సిపాలిటీలోని 5వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చౌదరి సుచరిత పోటీలో నిలిచారు. యువత ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమె తెలిపారు. తన తండ్రి చౌదరి సుప్రభాత్ చేసిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి మరి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కానీ డబ్బు, మద్యం ప్రభావం ఉండే స్థానిక ఎన్నికల్లో ఈ చదువుకున్న యువత ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. ఓటర్లు కూడా పాత పద్ధతుల్లోనే ఓట్లు వేస్తారా లేక ఇలా బాగా చదువుకున్న యువతకు అవకాశం ఇచ్చి కొత్త మార్పుకు శ్రీకారం చుడతారా అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు