AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi : క్యాన్సర్ మరణశాసనం కాదు.. లైఫ్ స్టైల్ వల్లే వ్యాధులు వస్తాయి.. మెగాస్టార్ చిరంజీవి..

శరీరంలో వచ్చే మార్పులను నిర్లక్ష్యం చేయకూడదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చిరు మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధిపై అందరిలోనూ అవగాహన రావాలని అన్నారు.

Megastar Chiranjeevi : క్యాన్సర్ మరణశాసనం కాదు.. లైఫ్ స్టైల్ వల్లే వ్యాధులు వస్తాయి.. మెగాస్టార్ చిరంజీవి..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Feb 04, 2026 | 3:37 PM

Share

క్యాన్సర్ వ్యాధి అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదు. అది మన జీవన విధానంలో మనతోనే మొదలువుతుందని అన్నారు పద్మవిభూషన్, మెగాస్టార్ చిరంజీవి. బుధవారం కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “క్యాన్సర్ అనేగానే జీవితం ముగిసినట్లే అనుకుంటున్నారు అంతా.. కానీ ఇక్కడ ఇంత మంది క్యాన్సర్ వ్యాధిని జయించిన వారి చూస్తుంటే డాక్టర్లు ఎంతో కష్టపడుతున్నారో అర్థమవుతుంది. మన జీవనశైలి అధారంగానే మనకు వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్ అనేది మనకు మరణశాసనం కాదు ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ ని కూడా జయించి సాధారణ జీవితాన్ని అస్వాధించవచ్చన్నారు. ఇక్కడ ఎంతో మంది చిన్నారులను కూడా చూస్తున్నాం. వారి కూడా క్యాన్సర్ బారిన పడ్డారంటే ఎంతో బాధగా ఉంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ కూడా ఈ వ్యాధిపై అవగాహన పెంచుకొని, ఆయా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులు సంప్రదించాలని” సూచించారు.

అనంతరం కార్యక్రమ నిర్వహాకులు సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డా. ముధు దేవరశెట్టి మాట్లాడుతూ గతంలో 40, 50 సంవత్సరాల పైబడిన వారికే క్యాన్సర్ వ్యాధి వచ్చేది కానీ ఇప్పుడు వయసు సంబంధం లేకుండా చిన్న వయసుల వారు అంటే 5, 10 ఏళ్ల పిల్లలు కూడా క్యాన్సర్ బారీన పడుతున్నారు. దీనికి కారణం జన్యుపరమైన లోపాలు, వంశపరాంపర్యం, రేడియేషన్, రసాయణ పదార్థాలు, ఎరువులు వాడకం, మద్యం, ధూమపానం, ఒత్తిడికి గురై డయాబెటిస్ ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి. కానీ ప్రజల్లో అవగాన తక్కువ ఉండడంతో క్యాన్సర్ చివరి దశల్లో డాక్టర్ల దగ్గరకి వస్తున్నారు. అవగాహన అనేది చాలా కీలకం, ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం కిమ్స్ హాస్పిటల్స్ లో క్యాన్సర్ ఫైట్ సపోర్ట్ గ్రూప్ ని ఏర్పాటు చేశాం. దీని ముఖ్య ఉద్దేశ్యం చికిత్స పొందిన అనంతరం సాధారణ జీవితం గడుపుతున్న రోగులు ఏకమై ముందుకు వచ్చి, క్యాన్సర్ పూర్తిగా నయం అయ్యే వ్యాధేనని, చికిత్స పట్ల భయం అవసరం లేదన్న సందేశాన్ని సమాజానికి చాటి చెప్పాలన్నారు.

క్యాన్సర్ చికిత్స కోసం అనేక రకాలైన అత్యాధునికి చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. చికిత్స చేయించుకున్న తర్వాత కూడా ఎక్కువకాలం బ్రతికే అవకాశం ఉందన్నారు. సమాజంలోకి ఈ విషయం వెళ్లాల్సిన అవసరం ఎంతైన ఉందని వ్యాఖ్యానించారు. అలాగే క్యాన్సర్ ను జయించిన వారు తమ అనుభవాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు, మెడికల్ ఆంకాలజిస్ట్ డా. నరేందర్ కుమార్ తోట , క్యాన్సర్ చికిత్స పొందిన , పొందుతున్న వారు పాల్గొన్నారు.

ఎక్కువ మంది చదివినవి: Dhandoraa Movie : దండోరా సినిమాలో బింధు మాధవి పాత్రలో ఆ హీరోయిన్ నటించాల్సింది.. కానీ.. డైరెక్టర్

ఎక్కువ మంది చదివినవి: Cinema : అర్థరాత్రి హోటల్లో అరుపులు.. 24 ఏళ్లుగా ఆ హీ‏రోయిన్‏ను భయపెడుతున్న సినిమా.. ఇప్పటికీ..