Bigg Boss 8 Telugu: వెక్కి వెక్కి ఏడ్చిన గౌతమ్.. ఓదార్చిన హౌస్ మేట్స్ ..

ముందుగా అమ్మాయిలంతా నోటిలో నీళ్లేసుకొని రెడీ అయిపోయారు. ఇక అబ్బాయిల టీమ్ లీడర్ అయిన రోహిణి నవ్వించడానికి ప్రయత్నించింది. యష్మీ దగ్గరకు వచ్చి ఆహా.. యష్మీ మూతి ఎంతబాగుందో.. ఆ పుట్టుమచ్చ అంటూ నవ్వించే ప్రయత్నం చేసింది కానీ ఎవ్వరు నవ్వలేదు. 

Bigg Boss 8 Telugu: వెక్కి వెక్కి ఏడ్చిన గౌతమ్.. ఓదార్చిన హౌస్ మేట్స్ ..
Bigg Boss 8
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 10, 2024 | 7:39 AM

నామినేషన్స్ హడావుడి పూర్తయిన తర్వాత బిగ్ బాస్ ఇప్పుడు హౌస్ మేట్స్ కు కొన్ని ఫన్నీ టాస్క్ లు ఇచ్చాడు. దాంతో హౌస్ లో ఉన్న వారు నవ్వులు పూయించారు. జబర్దస్త్ పంచ్ లతో నవ్వించారు. ముఖ్యంగా అవినాష్-రోహిణి-గంగవ్వ  తమ మాటలు, కామెడీ, పంచ్ లతో తెగ నవ్వించారు. ఇక హౌస్ లో ఉన్న వారిని రెండు టీమ్స్ గా డివైడ్ చేశాడు బిగ్ బాస్. అమ్మాయిలు, అబ్బాయిలను టీమ్స్ గా పెట్టి అమ్మాయిల టీమ్ కు అవినాష్ ను అబ్బాయిల టీమ్ కు రోహిణిని లీడర్ గా ఉంచాడు. ఇక ఒక టీమ్  నోట్లో నీళ్లు నింపుకోవాలి. మరొక టీమ్ సభ్యుడు వచ్చి జోక్ చెప్పి వాళ్ళను నవ్వించాలి. అలా నవ్వకుండా ఉంటే గెలిచినట్టు అని ఫన్నీ టాస్క్ ఇచ్చాడు. ఇలా రెండు టీమ్స్ ఒకరి తర్వాత ఒకరు చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు బిగ్ బాస్.

ముందుగా అమ్మాయిలంతా నోటిలో నీళ్లేసుకొని రెడీ అయిపోయారు. ఇక అబ్బాయిల టీమ్ లీడర్ అయిన రోహిణి నవ్వించడానికి ప్రయత్నించింది. యష్మీ దగ్గరకు వచ్చి ఆహా.. యష్మీ మూతి ఎంతబాగుందో.. ఆ పుట్టుమచ్చ అంటూ నవ్వించే ప్రయత్నం చేసింది కానీ ఎవ్వరు నవ్వలేదు.  ఆ తర్వాత గంగవ్వను నవ్వించాడని ట్రై చేసింది కానీ ఎవ్వరూ నవ్వలేదు.

ఆ తర్వాత అబ్బాయిలంతా రెడీ అయ్యారు. ఇక అమ్మాయిల లీడర్ గా ఉన్న అవి అవినాష్ వచ్చి ముందుగా మణికంఠ దగ్గరకు వెళ్లి .. అఖిల బ్రహ్మాండకోటి.. అంటూ ఇమిటేట్ చేశాడు. కాసేపు నవ్వు ఆపుకున్న మణికంఠ.. ఆతర్వాత నవ్వేశాడు. దాంతో మణికంఠ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గౌతమ్ దగ్గరకు వెళ్లి అశ్వత్థామ 2.0 వచ్చాడు అని నవ్వించడానికి ట్రై చేశాడు అవినాష్.. ఇంతలో స్టేజ్ దిగిన గౌతమ్.. సరేసరే బ్రో ఒన్ సెకండ్.. అని గట్టిగా అరిచాడు. అశ్వత్థామ అన్నది సీజన్ 7లో అయిపోయింది అది మళ్లీ మళ్లీ తీసి నాకు ఇరిటేషన్ తెప్పించకు బ్రో.. అని అరిచి గోలచేశాడు. అది కామెడీ కాదు బ్రో నన్ను వెళ్లిపోమంటే వెళ్లిపోతా.. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది బ్రో.. అని మైక్ కింద పడేసి గౌతమ్ లోపలికి వెళ్లిపోయాడు గౌతమ్. దాంతో అవినాష్ కూడా సీరియస్ అయ్యాడు. ఎవ్వరూ హర్ట్ అవ్వోద్దు అని ముందే చెప్పను గా ఇలా చేస్తే ఎలా బిగ్ బాస్ నేను ఈ టాస్క్ ఆడాను అని అవినాష్ కూడా సీరియస్ గా చెప్పాడు.  తర్వాత లోపలికి వెళ్లి  కూర్చొని గౌతమ్ ఏడ్చాడు. దీంతో అవినాష్ సహా అందరూ గౌతమ్ దగ్గరికెళ్లి ఓదార్చారు. సీజన్ 7 లో దీని మీద నన్ను బాగా ట్రోల్ చేశారు. నేను చాలా బాధపడ్డాను. అప్పుడు నన్ను ఒకొక్కరు ఒకొక్కలా ట్రీట్ చేశారు. తట్టుకోలేక అలా అన్నాను అని ఏడ్చేశాడు. అది అయ్యేవరకూ ఆగుదామనుకున్నా.. కానీ అనుకోకుండా వచ్చేసింది.. సారీ.. మిమ్మల్ని అందామని కాదు.అని గౌతమ్ సారీ చెప్పాడు.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!