Mahesh Babu: ‘నువ్వు కాపాడిన 3772వ ప్రాణం సామీ’.. మరో చిన్నారికి ప్రాణం పోసిన మహేష్ బాబు.. ఫ్లెక్సీ చూశారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియాలో ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో ఒకరైన ఆయనకు ఓ రేంజ్ లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే అభిమానులు మహేష్ పై ఇంతటి ప్రేమాభిమానాలు చూపడానికి కారణం సినిమాలే కాదు.. ఆయన చేస్తోన్న సామాజిక సేవా కార్యక్రమాలు కూడా

Mahesh Babu: 'నువ్వు కాపాడిన 3772వ ప్రాణం సామీ'.. మరో చిన్నారికి ప్రాణం పోసిన మహేష్ బాబు.. ఫ్లెక్సీ చూశారా?
Mahesh Babu
Follow us
Basha Shek

|

Updated on: Oct 10, 2024 | 7:27 AM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండియాలో ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో ఒకరైన ఆయనకు ఓ రేంజ్ లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే అభిమానులు మహేష్ పై ఇంతటి ప్రేమాభిమానాలు చూపడానికి కారణం సినిమాలే కాదు.. ఆయన చేస్తోన్న సామాజిక సేవా కార్యక్రమాలు కూడా. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో పలు మంచి పనులు చేపడుతున్నాడీ రియల్ హీరో. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల గురించి. తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణంగా గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్యం చేయించాలని మహేష్ బాబు నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ద్ సర్జరీలు చేయించాడు మహేష్. తద్వారా వారి తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపాడు. తాజాగా మరో చిన్నారికి ప్రాణం పోశాడు మహేష్. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కత్తుల వారి పేటకు చెందిన రెండేళ్ల రిత్వికకు ఉచితంగా గుండె సర్జరీ చేయించాడు. ఈ క్రమంలో కత్తుల వారి పేటలో మహేష్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘నువ్వు కాపాడిన 3772 వ ప్రాణం సామీ.. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు. మాకు నమ్మించే అక్కర లేదు. ఇది నీ దర్శనం.. ఇది నిదర్శనం’ అంటూ ఖలేజా డైలాగ్ తో వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు మహేష్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు మహేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం మూవీతో అభిమానులను పలకరించాడు మహేష్. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కోసం గతంలో ఎన్నడూ లేనతంగ జుట్టు, గడ్డం, బాడీ పెంచేశాడు. ముఖ్యంగా భారీ వర్కౌట్స్ చేస్తూ బాడీ మెయింటేన్ చేస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో. దీంతో మహేష్ ఈ మధ్య ఎప్పుడు బయట కనిపించినా అతని లుక్స్ తెగ వైరలవుతున్నాయి. మహేష్- జక్కన్న మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

కత్తుల వారి పేటలో వెలసిన ఫ్లెక్సీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!