Bigg Boss 4: నాగార్జునకు భారీ రెమ్యునరేషన్
బుల్లితెరపై బిగ్‌బాస్ కనువిందు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆగష్టు మధ్యలో బిగ్‌బాస్ నాలుగో సీజన్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
Bigg Boss 4 Akkineni Nagarjuna: బుల్లితెరపై బిగ్‌బాస్ కనువిందు చేసేందుకు సిద్ధమవుతోంది. ఆగష్టు మధ్యలో బిగ్‌బాస్ నాలుగో సీజన్‌ని ప్రారంభించాలనుకుంటున్నారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కంటెస్టెంట్‌లను ఇప్పటికే ఫైనల్ చేసుకోగా.. వారికి టెస్ట్‌లు నిర్వహించి, ఐసోలేషన్‌లో ఉంచినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సీజన్‌కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తుండగా.. ఆయనకు భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు టాక్. మొత్తం 70 రోజుల పాటు సాగే ఈ షోలో నాగార్జున 10 రోజుల పాటు కనిపించనున్నారట. ఇక ఒక్కో ఎపిసోడ్‌కి రూ.12 లక్షల చొప్పున నాగార్జునకు పారితోషికం ముట్టనున్నట్లు టాక్. కాగా ఈ సీజన్‌లో 13 మంది కంటెస్టెంట్‌లు సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కరోనా నేపథ్యంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసేసినట్లు సమాచారం.
Read This Story Also: ఎంత ధైర్యం.. పులి పిల్లకు పాలు తాగిస్తోన్న ఉపాసన