‘సుశాంత్‌ది హత్య అనుకుంటున్నా.. ఇదిగో ప్రూఫ్’
మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్య స్వామి సుశాంత్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'సుశాంత్‌ది హత్య అని అనుకుంటున్నానని.. దానికి సంబంధించిన ఎవిడెన్స్ లిస్టు ఇదేనంటూ..
Subramanian Swamy Tweet On Sushant: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఓ మిస్టరీలా మారింది. కొంతమంది డిప్రెషన్ వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని అంటుంటే.. మరికొందరు మాత్రం ఆయన్ని హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఇక సుశాంత్ అభిమానులు మాత్రం తమ హీరో మరణం వెనుక రహస్యాల కోసం వెతుకులాట ప్రారంభించారు.
ఇదిలా ఉంటే తాజాగా మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్య స్వామి సుశాంత్ మరణంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సుశాంత్‌ది హత్య అని అనుకుంటున్నానని.. దానికి సంబంధించిన ఎవిడెన్స్ లిస్టు ఇదేనంటూ ఆయన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఉండదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే సుబ్రహ్మణ్య స్వామి సాక్ష్యాలతో కూడిన ఈ ట్వీట్‌ను చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇక స్వామి చెప్పిన జాబితాలో.. మెడపై ఉన్న గుర్తులు ఆత్మహత్యకు ఉపయోగించిన వస్త్రంతో సరిపోకపోవడం, శరీరంపై అనేక చోట్ల మార్క్స్, సీసీటీవీ ఫుటేజ్ లేకపోవడం, రూమ్ డూప్లికేట్ కీ మిస్సింగ్, సుశాంత్ మేనేజర్ దిశా ఆత్మహత్య, సిమ్ కార్డులు మార్చడం, నో ఫైనాన్సియల్ క్రైసెస్, పనివాడు తప్పుడు వాంగ్మూలం మొదలైనవి హత్య జరిగి ఉండొచ్చుననే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
అటు మరో ట్వీట్‌లో ”ముంబై మూవీ మాఫియా ఈ మర్డర్ కేసును ఒక గొడవ కేసుగా చిత్రీకరించాలని చూస్తోంది. ఓ నటిపై ఇదంతా మోపి రూ. 15 కోట్ల కోసం గొడవ జరిగినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ నటిని బలి చేయాలని చూస్తున్నారు. అటు సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని 80 శాతం మంది ముంబై పోలీసులు కోరుతున్నట్లు” స్వామి పేర్కొన్నారు.
Also Read:
సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..
సుశాంత్ మరణం వెనుక రహస్యాలు.. షాకింగ్ నిజాలు.. వైరల్ వీడియో..
Why I think Sushanth Singh Rajput was murdered pic.twitter.com/GROSgMYYwE
— Subramanian Swamy (@Swamy39) July 30, 2020
The Mumbai Movie Mafia has decided to dump a female actress so that potentially a murder case becomes a quarrel case( Lafhda in Mumbai Hindi) for ₹15 crores. The female is easy to sacrifice for M3 to deflect the case
— Subramanian Swamy (@Swamy39) July 30, 2020
80% of the Mumbai Police want the case to be sent to CBI, since this SSR high profile steaming hot case is overloading the Police.
— Subramanian Swamy (@Swamy39) July 30, 2020