Bigg Boss 14: చివరి దశకు చేరుకున్న బిగ్‌బాస్‌ 14.. ట్రోఫీ ఎవరు దక్కించుకోనున్నారు.. ట్రెండ్స్‌ ఏం చెబుతున్నాయి..

Bigg Boss 14 Final: ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో విజయవంతంగా దూసుకెళుతోంది బిగ్‌బాస్‌ రియాలిటీ షో. ఎక్కడో అమెరికాలో మొదలైన ఈ షో తెలుగులోనూ...

Bigg Boss 14: చివరి దశకు చేరుకున్న బిగ్‌బాస్‌ 14.. ట్రోఫీ ఎవరు దక్కించుకోనున్నారు.. ట్రెండ్స్‌ ఏం చెబుతున్నాయి..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 21, 2021 | 8:17 PM

Bigg Boss 14 Final: ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో విజయవంతంగా దూసుకెళుతోంది బిగ్‌బాస్‌ రియాలిటీ షో. ఎక్కడో అమెరికాలో మొదలైన ఈ షో తెలుగులోనూ విజయవంతమైందంటేనే దీని క్రేజ్‌ ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే సీజన్‌ల మీద సీజన్‌లతో షో దూసుకెళుతోంది. ఈ క్రమంలో భారత్‌లో మొదటిసారి బిగ్‌బాస్‌ ప్రారంభమైన హిందీలో ప్రస్తుతం 14వ సీజన్‌ కొనసాగుతోంది. సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షో తుది దశకు చేరుకుంది. నేటితో (ఆదివారం) ముగియనున్న ఈ షోలో ట్రోఫీతో పాటు రూ.50 లక్షల క్యాష్‌ ప్రైజ్‌ ఎవరు గెలుచుకుంటారన్న ఆసక్తి అందిరిలో నెలకొని ఉంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలతో కలిపి 23 మంది హౌజ్‌మెంట్స్‌ బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గత సీజన్‌ల కంటే కొంచం డిఫ్రెంట్‌గా మొదటి వారం నుంచే టాస్క్‌లతో పాటు శిక్షల విషయంలో కూడా షో నిర్వాహకుల కొత్తదనాన్ని చూపించారు. ఈ క్రమంలోనే కొన్ని కాంట్రవర్సీలు ఎదురైనా షో నిర్వాహకులు వెనక్కి తగ్గలేదు. కంటెస్టెంట్‌ల మధ్య గోడవలు, స్నేహలు, ప్రేమలు, ముద్దు ముచ్చట్లతో సాగిన ఈ షో ఆద్యంతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 141 రోజుల పాటు సాగిన ఈ షోలో చివరి ఐదుగురు ఫైనలిస్టుల్లో రుబినా దిలక్‌, రాహుల్‌ వైద్యా, అలీ గోని, నిక్కీ తంబోలి, రాఖీ సవంత్‌ నిలిచారు. దీంతో వీరిలో ఎవరు టైటిల్‌ గెలుచుకుంటారని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా నిర్వహించిన ఓ ఆన్‌లైన్‌ పోల్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం.. బిగ్‌బాస్‌ 14 సీజన్‌ (హిందీ) టైటిల్‌ను రుబినా గెలుచుకోనున్నట్లు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక రాహుల్‌ వైద్య రెండో స్థానంలో నిలిచాడు. ఇక కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అయిన రాఖీ సవంత్‌ మూడో స్థానంలో, అలి గోని నాలుగో స్థానం, నిక్కి తంబోలి ఐదో స్థానంలో ఉండనున్నట్లు నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

Also Read: Anasuya: సౌత్‌లో అనసూయ సందడి మాములుగా లేదుగా.. మాలీవుడ్‌ నుంచి పిలుపు అందుకున్న అందాల యాంకర్‌..