రెండేళ్ల తరువాతే ‘అవతార్ 2’

అద్భుతమైన గ్రాఫిక్స్‌తో పిల్లలు, పెద్దలందరినీ ఆకట్టుకున్న ‘అవతార్’ మూవీ సీక్వెల్ రానుంది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ మూవీ సీక్వెల్‌కు శ్రీకారం చుట్టాడు డైరక్టర్ జేమ్స్ కామెరూన్. అయితే ఇప్పుడప్పుడే కాదండోయ్. మరో రెండేళ్లకు. అంటే 2021లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17 రెండో భాగం రిలీజ్ అవుతుందని కామెరూన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. Busy on set, so no time to hang around but […]

రెండేళ్ల తరువాతే ‘అవతార్ 2’
TV9 Telugu Digital Desk

| Edited By:

May 08, 2019 | 12:48 PM

అద్భుతమైన గ్రాఫిక్స్‌తో పిల్లలు, పెద్దలందరినీ ఆకట్టుకున్న ‘అవతార్’ మూవీ సీక్వెల్ రానుంది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ మూవీ సీక్వెల్‌కు శ్రీకారం చుట్టాడు డైరక్టర్ జేమ్స్ కామెరూన్. అయితే ఇప్పుడప్పుడే కాదండోయ్. మరో రెండేళ్లకు. అంటే 2021లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17 రెండో భాగం రిలీజ్ అవుతుందని కామెరూన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

కాగా 2009లో వచ్చిన ‘అవతార్’ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు భాగాలు ఉంటాయని తెలిపిన కామెరూన్.. వాటన్నింటిని తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇక రెండో భాగం షూటింగ్ చివరి దశకు చేరిన నేపథ్యంలో విడుదల తేదిని అనౌన్స్ చేశాడు ఈ దర్శకదిగ్గజం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu