AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: నయనతార పెళ్లిపై ప్రముఖ జ్యోతిష్కుడి సెన్షేషనల్‌ కామెంట్స్‌.. ఆమె జాతకంలో అలా ఉందంటూ..

Nayanthara: తమ పెళ్లిపై అటు నయన్‌ కానీ, విఘ్నేశ్‌ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈక్రమంలో సినిమా తారల జాతకాలు, జోస్యం గురించి చెప్పే ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి నయనతార (Nayanthara) పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Nayanthara: నయనతార పెళ్లిపై ప్రముఖ జ్యోతిష్కుడి సెన్షేషనల్‌ కామెంట్స్‌.. ఆమె జాతకంలో అలా ఉందంటూ..
Nayanthara Marriage
Basha Shek
| Edited By: |

Updated on: May 12, 2022 | 9:57 AM

Share

Nayanthara: గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార- విఘ్నేశ్‌ శివన్‌లు త్వరలో పెళ్లి చేసుకోనున్నారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌లోనే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట జూన్‌ 9న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏడడుగులు నడవనున్నారని ప్రచారం సాగుతోంది. అయితే తమ పెళ్లిపై అటు నయన్‌ కానీ, విఘ్నేశ్‌ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈక్రమంలో సినిమా తారల జాతకాలు, జోస్యం గురించి చెప్పే ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి నయనతార (Nayanthara) పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నయనతారకు వివాహం అచ్చిరాదని, తన వైవాహిక జీవితం సవ్యంగా సాగదని స్వామి చెబుతున్నారు. ఆమె జాతకంలో గురుడు నీచ స్థితిలో ఉ‍న్నాడని, అందువల్ల వైవాహిక జీవితంలో కలతలు, మనస్పర్థలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. వారు కొద్దికాలానికే విడాకులు కూడా తీసుకునే అవకాశం ఉందంటూ షాకింగ్‌ కామెంట్లు చేశారు.

గతంలో కూడా..

కాగా గతంలో సమంత, నాగచైతన్య పెళ్లి విషయంలో వేణు స్వామే సంచలన వ్యాఖ్యలు చేశారు. సామ్‌కు దాంపత్య జీవితం కలిసిరాదని, ఆమె పెళ్లి చేసుకున్న అతి త్వరలోనే భర్తతో విడిపోతుందని జోస్యం చెప్పారు. స్వామి చెప్పినట్లుగానే చై, సామ్‌ విడిపోయి విడాకులు తీసుకోవడంతో ఈ జ్యోతిష్కుడు వెలుగులోకి వచ్చారు. ఈక్రమంలో త్వరలో పెళ్లిపీటలెక్కనున్న నయనతారపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో చర్చనీయాంశమవుతోంది. కాగా నయన్‌ వివాహంతో పాటు దక్షిణాదిని ఏలుతున్న కొందరి హీరోయిన్లపై కూడా వేణు స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనుష్క శెట్టి, రష్మిక మందన్నాలకు సైతం వైవాహిక జీవితం అచ్చి రాదన్నారు. వీరి జాతకంలో కూడా గురువు నీచ స్థితిలో ఉన్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Gastroenteritis: అక్కడ భారీగా పెరుగుతోన్న గ్యాస్ట్రో ఎంటెరిటిస్ కేసులు.. బాధితులతో నిండిపోతున్న ఆస్పత్రులు.. కారణమేంటంటే..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు తెలంగాణ సర్కార్‌ మరో గుడ్‌ న్యూస్‌.. ఆ థియేటర్లలో ఉదయం 4 నుంచే స్పెషల్ షోలు..

RR vs DC, IPL 2022: దంచికొట్టిన మార్ష్‌, వార్నర్‌.. RRపై ఢిల్లీ సూపర్‌ విక్టరీ.. ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవం..