Ashwini Puneeth Rajkumar : ఆడి కారు కొన్న స్టార్ హీరో సతీమణి.. ధర ఎంత అంటే..
సినిమాలను నిర్మిస్తూ కొత్త ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తుంది. ప్రత్యేకంగా దర్శకులు, మహిళా సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పిస్తోంది. అలాగే మహిళా ప్రధాన చిత్రాలను నిర్మిస్తూ కన్నడ సినీ పరిశ్రమలో సక్కెస్ ఫుల్ నిర్మాతగా మారుతున్నారు. అలాగే ఇప్పుడిప్పుడే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా అశ్విని పునీత్ రాజ్ కుమార్ కొత్త లగ్జరీ కారును కోనుగోలు చేసింది.

దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని ఇప్పటికీ కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభిమాన హీరో మరణించి మూడేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ పునీత్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. భర్త మరణానంతరం ఆయన బాధ్యతలు భూజాన వేసుకున్నారు పునీత్ సతీమణి అశ్విని. ఇప్పుడిప్పుడే ఆ దుఃఖం నుంచి బయటకు వస్తున్న ఆమె.. అటు నిర్మాణ పనులలో నిమగ్నమవుతున్నారు. సినిమాలను నిర్మిస్తూ కొత్త ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తుంది. ప్రత్యేకంగా దర్శకులు, మహిళా సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పిస్తోంది. అలాగే మహిళా ప్రధాన చిత్రాలను నిర్మిస్తూ కన్నడ సినీ పరిశ్రమలో సక్కెస్ ఫుల్ నిర్మాతగా మారుతున్నారు. అలాగే ఇప్పుడిప్పుడే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా అశ్విని పునీత్ రాజ్ కుమార్ కొత్త లగ్జరీ కారును కోనుగోలు చేసింది.
అశ్విని పునీత్ రాజ్‌కుమార్ ఐషారామి ఆడి క్యూ7 కారును కొనుగోలు చేశారు. అశ్విని కారు పక్కన నిలబడి ఉన్న చిత్రాన్ని ఆడి బెంగళూరు ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. అశ్విని పునీత్‌రాజ్‌కుమార్ గ్రే కలర్ ఆడి క్యూ7 కారును కొనుగోలు చేశారు. ఈ కారు ధర బెంగళూరులో రూ.1.10 కోట్ల నుండి రూ.1.20 కోట్లు. అశ్విని ఆడి క్యూ7 టాప్ ఎండ్ మోడల్‌ను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.
అశ్విని పునీత్ రాజ్‌కుమార్ కొనుగోలు చేసిన ఆడి క్యూ7 కారులో చాలా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో అత్యాధునిక సాంకేతికత, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఎయిర్ బ్యాగ్‌లు, కెమెరా, ADAS టెక్నాలజీ, రోడ్ గ్రిప్ టెక్నాలజీ ఉన్నాయి. ఈ కారులో 100 కి.మీ వేగాన్ని తక్కువ సెకన్లలో దాటగల సామర్థ్యం, మసాజర్ ఉన్న సీట్లు, అద్భుతమైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆధునిక సాంకేతికతతో కూడిన షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. పునీత్ రాజ్‌కుమార్‌కు కూడా కార్లంటే ప్రత్యేకమైన ఇష్టం. పునీత్ రాజ్‌కుమార్ చాలా విలాసవంతమైన మరియు ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. శాండల్‌వుడ్ నటుల్లో లంబోర్గినీ ఉరస్ కారును కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి అప్పు. ఇప్పుడు ఆ కారును అతని దగ్గరి బంధువు నడుపుతున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
