AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్జున్ రెడ్డి వర్సెస్ ఫలక్‌నుమా దాస్..!

అర్జున్ రెడ్డి వర్సెస్ ఫలక్‌నుమా దాస్ మధ్య జరుగుతున్న వార్ తారాస్థాయికి చేరింది. ఫలక్‌నుమా దాస్ చిత్రం ఇద్దరు హీరోల మధ్య అగ్గి రాజేస్తోంది. సినిమా పరమ చెత్తగా ఉందంటూ ప్రముఖ యువ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు చిత్ర యూనిట్‌కు మంట పుట్టిస్తున్నాయి. దీనిపై ఫలక్‌నుమా దాస్ చిత్ర హీరో విశ్వక్ విజయ్ దేవరకొండపై మండిపడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో వార్ హీటెక్కింది. హైదరాబాద్ […]

అర్జున్ రెడ్డి వర్సెస్ ఫలక్‌నుమా దాస్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 03, 2019 | 11:59 AM

Share

అర్జున్ రెడ్డి వర్సెస్ ఫలక్‌నుమా దాస్ మధ్య జరుగుతున్న వార్ తారాస్థాయికి చేరింది. ఫలక్‌నుమా దాస్ చిత్రం ఇద్దరు హీరోల మధ్య అగ్గి రాజేస్తోంది. సినిమా పరమ చెత్తగా ఉందంటూ ప్రముఖ యువ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు చిత్ర యూనిట్‌కు మంట పుట్టిస్తున్నాయి. దీనిపై ఫలక్‌నుమా దాస్ చిత్ర హీరో విశ్వక్ విజయ్ దేవరకొండపై మండిపడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో వార్ హీటెక్కింది.

హైదరాబాద్ సిటీ బేసెడ్‌గా ఇటీవలే విడుదలైన ఫలక్‌నుమా దాస్ చిత్రం.. ఆశించిన స్థాయిలో లేదని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు ఇద్దరి మధ్య చిచ్చురేపుతోంది. సినిమా బాగాలేదంటూ విజయ్ ఫ్యాన్స్ నెగటీవ్ పబ్లిసిటీ చేస్తున్నారంటూ హీరో విశ్వక్.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌పై మండిపడుతున్నారు. దీంతో విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టిమరీ.. అభిమానులను హెచ్చరించాడు విజయ్.

అటు విశ్వక్ కామెంట్స్‌పై విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. చూసుకుందాం అంటే చూసుకుందాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకుంటూ వార్‌ని హీటెక్కిస్తున్నారు. ఫలక్‌నుమా దాస్ సినిమాకు అడ్డంకులు సృష్టిస్తే మీ అంతు చూస్తామంటూ హీరో విశ్వక్… విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. హైదరాబాద్‌లో పెద్దర్యాలీ తీసి సక్సెస్ మీట్ పెట్టి విజయ్‌పై విరుచుకుపడాలని విశ్వక్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో.. ఇరువర్గాల మధ్య వార్ పీక్ స్టేజ్‌కి చేరుకుంది.

Follow Us