AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రకుల్ బాలీవుడ్ సినిమా తెలుగులోకి..

బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘దే దే ప్యార్ దే’. సీనియర్ హీరోయిన్ టబు కీలకపాత్ర పోషించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 100 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్ కానుందట. విక్టరీ వెంకటేష్ హీరోగా నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని సమాచారం. ఈ మేరకు రీమేక్ రైట్స్‌ను […]

రకుల్ బాలీవుడ్ సినిమా తెలుగులోకి..
Ravi Kiran
|

Updated on: Jun 03, 2019 | 12:54 PM

Share

బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘దే దే ప్యార్ దే’. సీనియర్ హీరోయిన్ టబు కీలకపాత్ర పోషించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 100 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్ కానుందట.

విక్టరీ వెంకటేష్ హీరోగా నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని సమాచారం. ఈ మేరకు రీమేక్ రైట్స్‌ను ఆయన దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 50 ఏళ్ళ హీరో పాత్రలో వెంకటేష్ కనిపించనుండగా.. 25 ఏళ్ళ హీరోయిన్ పాత్ర కోసం మళ్ళీ రకుల్‌నే తీసుకోనున్నారని వినికిడి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందట. మరి అసలు ఇది నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Follow Us