AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడివి శేషు మరో థ్రిల్లర్.. ‘ఎవరు’

మొదటి నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు సొంతం చేసుకుంటోన్న యువ నటుడు అడివి శేషు మరో థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త దర్శకుడు వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేషు నటిస్తుండగా.. ఆ చిత్రానికి ‘ఎవరు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఇందులో అడివి శేషు సరసన రెజీనా నటిస్తుండగా.. నవీన్ కృష్ణ, మురళీ శర్మ కీలకపాత్రలలో […]

అడివి శేషు మరో థ్రిల్లర్.. ‘ఎవరు’
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 03, 2019 | 10:31 AM

Share

మొదటి నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస విజయాలు సొంతం చేసుకుంటోన్న యువ నటుడు అడివి శేషు మరో థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొత్త దర్శకుడు వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేషు నటిస్తుండగా.. ఆ చిత్రానికి ‘ఎవరు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఇందులో అడివి శేషు సరసన రెజీనా నటిస్తుండగా.. నవీన్ కృష్ణ, మురళీ శర్మ కీలకపాత్రలలో కనిపించనున్నారు. పీవీపీ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టు 23న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రంతో పాటు అడివి శేషు ప్రస్తుతం గూఢచారి 2, మేజర్ చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే.

Follow Us