సినిమాలకు అనుష్క గుడ్‌బై..!

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Jul 13, 2020 | 5:22 PM

సినిమాలకు అనుష్క గుడ్‌బై చెప్పబోతోందా..! ఇకపై వెండి తెరపై జేజమ్మ కనిపించదా..? ఇప్పుడు ఈ ప్రశ్నలే ఫిలింనగర్‌లో వినిపిస్తున్నాయి.

సినిమాలకు అనుష్క గుడ్‌బై..!

సినిమాలకు అనుష్క గుడ్‌బై చెప్పబోతోందా..! ఇకపై వెండి తెరపై జేజమ్మ కనిపించదా..? ఇప్పుడు ఈ ప్రశ్నలే ఫిలింనగర్‌లో వినిపిస్తున్నాయి. మూవీలకు గుడ్‌బై చెప్పాలని అనుష్క నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన సన్నిహితుల వద్ద ఆమె ప్రస్తావించినట్లు టాక్‌.

కాగా సూపర్‌తో హీరోయిన్‌గా కెరీర్‌ని ప్రారంభించిన అనుష్క తెలుగు, తమిళంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అంతేకాదు లేడీ ఓరియెండెట్ మూవీలతో మెప్పించారు. ఇక ఈ నటి నటించిన నిశ్శబ్దం విడుదల సిద్ధంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయలా..? లేక థియేటర్లలో విడుదల చేయాలన్న అన్న విషయంపై ఇంకా దర్శకనిర్మాతలు తర్జనభర్జనలు పడుతున్నారు. ఇక ఈ మూవీ తరువాత అనుష్క మరే చిత్రానికి ఓకే చెప్పలేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఆ మధ్యన ఓ మూవీకి అనుష్క ఓకే చెప్పినా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా వాయిదా పడిందట. కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ మూవీ ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తోంది‌. మరోవైపు అనుష్కకు పెళ్లి చేయాలన్న ఆలోచనలో ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే అనుష్క సినిమాలకు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్లపై అనుష్క ఎలా స్పందింస్తుందో చూడాలి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu