AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: రాజస్థాన్‌ ఫేమస్ బాబా రియల్ లైఫ్ స్టోరీ.. ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్.. తెలుగులోనూ..

రాజస్థాన్ లోని ఓ ఫేమస్ బాబా జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ సినిమా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: రాజస్థాన్‌ ఫేమస్ బాబా రియల్ లైఫ్ స్టోరీ.. ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ సూపర్ హిట్.. తెలుగులోనూ..
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 09, 2026 | 7:30 PM

Share

ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇప్పటికే రామ్ చరణ్ పెద్ది సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే సింగ్ గీతం కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై సందడి చేస్తోంది. ఇక శుక్రవారం (జులై 10) నుంచి బల్టీ, పరిమళ అండ్ కో తదితర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే తాజాగా ఓ సినిమా సడెన్ గా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తోంది. ఇదొక రియల్ స్టోరీ. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రాజస్థాన్‌లోని ఫేమస్ ‘బుల్లెట్ బాబా’ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఊరిలో ఓ పాత లూనా బైక్ చుట్టూ కొందరు అల్లేసిన కథలు మూఢ విశ్వాసాలకు ఎలా కారణమయ్యాయి? కొందరు దీన్ని వ్యాపారంగా ఎలా మార్చుకున్నారన్నదే ఈ సినిమా స్టోరీ. గ్రామానికి చెందిన ఠాకూర్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి రోడ్డు ప్రమాదంలో కన్నుమూస్తాడు. దీంతో అతను నడిపిన పాత లూనా బైక్ ను పోలీసులు స్టేషన్‌లో పెడతారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ తర్వాతి రోజు ఉదయానికే ఆ బైకు యాక్సిడెంట్ జరిగిన చోటుకు వచ్చి ఉంటుంది?

పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా బైకు అక్కడికే వచ్చి ఉంటుంది. దీంతో ఆ బైక్‌కు మహిమలు ఉన్నాయంటూ కొందరు స్థానికులు దాని చుట్టూ కథలు అల్లు తారు. వీటిని గ్రామస్తులు కూడా గుడ్డిగా నమ్ముతారు. చివరకు ఆ రోడ్డు పక్కనే ఆ బైక్‌కు గుడి కట్టి దేవుడిలా ప్రతిష్టించి పూజలు చేస్తుంటారు. అసలు ఆ బైక్ ఎందుకు అక్కడికే వచ్చి ఉంటుంది? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? మూఢ నమ్మకాలతో అక్కడి స్థానికులు అమాయకులైన ప్రజలను ఎలా మభ్యపెట్టారన్నది ఈ సినిమా చూసి తెల్చుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా పేరు డుగ్ డుగ్ ((Dug Dug). రిత్విక్ పరీక్ తెరకెక్కించిన ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్, నిఖిల్ అద్వానీ, విక్రమాదిత్య మోత్వానే, వాసన్ బాలా లాంటి ఇండియాస్ టాప్ మోస్ట్ కల్ట్ ఫిల్మ్ మేకర్స్ సపోర్ట్ ఇచ్చారు. సినిమాలో రిత్విక్‌తో పాటు యోగేంద్ర సింగ్ పర్మార్, గౌరవ్ సోనీ, ముకుల్ కుమార్ సింగ్, సర్వేష్ వ్యాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగులోకి కూడా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో డుగ్ డుగ్ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us