AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Card: మీ రేషన్ కార్డు నెంబర్ మర్చిపోయారా..? ఆన్‌లైన్ ద్వారా చిటికెలో తెలుసుకోండి.. ఈజీగా ఇలా..

మీ దగ్గర రేషన్ కార్డు లేదా..? కానీ దాని నెంబర్ తెలుసుకోవాలనుకుంటున్నారా.. మీ రేషన్ కార్డును డౌన్ లోడ్ చేసకోవాలని అనుకుంటున్నారా.. అయితే చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మీ రేషన్ కార్డును ఆన్‌లైన్‌లో గుర్తించవచ్చు. ఈ ప్రాసెస్ ఎల అనేది ఒకసారి చూద్దాం.

Ration Card: మీ రేషన్ కార్డు నెంబర్ మర్చిపోయారా..? ఆన్‌లైన్ ద్వారా చిటికెలో తెలుసుకోండి.. ఈజీగా ఇలా..
New Ration Cards
Venkatrao Lella
|

Updated on: Jul 09, 2026 | 6:50 PM

Share

రేషన్ కార్డు అనేది దేశంలో ఉన్న సామాన్యులకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ అనేది తెలిసిందే. ఈ కార్డు లేకుండా ఎలాంటి ప్రభుత్వ పథకాలు మీరు పొందలేరు. ప్రభుత్వం పథకాలకు అర్హత లభించాలంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి. అందుకే ఈ కార్డు అనేది అన్నింటికంటే ముఖ్యమైన డాక్యుమెంట్. ఇక ప్రభుత్వ పథకాలు పొందటమే కాకుండా ఒక గుర్తింపు ధృవీకరణ పత్రంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్య రేషన్ షాపుల్లో ఉచిత రేషన్ పొందేందుకు ఇది అవసరమవుతుంది. ఇది మీ దగ్గర లేకపోతే రేషన్ పొందలేరు. ఇలాంటప్పుడు ఆన్లైన్ ద్వారా మీ రేషన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది చూద్దాం..

ఆన్‌లైన్‌లో రేషన్ కార్డు నెంబర్ ఎలా కనిపెట్టాలి..?

-గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి

– కేంద్ర ప్రభుత్వానికి చెందిన మేరా రేషన్ యాప్‌ కోసం సెర్చ్ చేయండి

-యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి

-మీ మొబైల్‌లో యాప్‌ను తెరవండి

– ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి

-మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి

– రేషన్ కార్డు నంబర్, కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్‌పై కనిస్తాయి

-మీరు దానిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు

డిజిలాకర్ ద్వారా ఎలా కనిపెట్టాలి..?

-గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి డిజిలాకర్ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి

– మీ మొబైల్‌లో డిజిలాకర్ యాప్‌ను తెరవండి

– ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ఈ యాప్‌లోకి లాగిన్ అవ్వండి

-పత్రాల విభాగంలోకి వెళ్లి రేషన్ కార్డు కోసం సెర్చ్ చేయండి

– మీ రాష్ట్రాన్ని ఎంచుకుని ఆధార్ కార్డు నంబర్‌ ఎంటర్ చేయండి

– డిజిటల్ రేషన్ కార్డు మీకు స్క్రీన్‌పై కనిపిస్తుంది

-మీ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్.. రేషన్ కార్డుతో లింక్ అయి ఉంటేనే ఈ విధానాలు వర్క్ అవుతాయి

తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం..

-ఏపీ ప్రజలు AePDS – AP యాప్, తెలంగాణ ప్రజలు టీ రేషప్ ద్వారా కూడా రేషన్ కార్డు ఆన్ లైన్ సేవలు పొందవచ్చు.  మీ రేషన్ కార్డు వివరాలతో పాటు మీ సమీపంలోని రేషన్ దుకాణం వివరాలు, మీ కుటుంబానికి ఎంత రేషన్ కేటాయించారు.. మీరు ఎంత రేషన్ ఇప్పటివరకు తీసుకున్నారు అనే వివరాలు తెలుసుకోవచ్చు. రేషన్ కార్డు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా ఉండేందుకు, అక్రమాలకు అడ్డకట్ట వేసేందుకు ఈ యాప్స్‌ను ప్రభుత్వాలు తీసుకొచ్చాయి.  దీంతో మీ రేషన్‌కు సంబంధించి సమగ్ర సమాచారం వీటిల్లో తెలుసుకోవచ్చు.

Follow Us