AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sanju Samson : సంజూ శాంసన్‌ను కేఎల్ రాహుల్‌లా ట్రీట్ చేయకండి.. ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు

Sanju Samson : సంజూ శాంసన్‌ను కేఎల్ రాహుల్‌ లా ట్రీట్ చేయొద్దని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించారు. టాప్ ఆర్డర్‌లోనే సంజూకు అవకాశాలు ఇవ్వాలని, తిలక్ వర్మను పక్కన పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Sanju Samson : సంజూ శాంసన్‌ను కేఎల్ రాహుల్‌లా ట్రీట్ చేయకండి.. ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sanju Samson
Rakesh
|

Updated on: Jul 09, 2026 | 6:45 PM

Share

Sanju Samson : ఇంగ్లాండ్‌తో బ్రిస్టల్ వేదికగా జరగబోయే నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు భారత జట్టు సెలెక్షన్, బ్యాటింగ్ ఆర్డర్‌పై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటర్ ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పష్టమైన అభిప్రాయాలను పంచుకున్నారు. స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ పట్ల టీమ్ మేనేజ్‌మెంట్ ప్రవర్తిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. జట్టులో మార్పులు చేయాల్సి వస్తే మొదట సంజూ శాంసన్‌నే పక్కన పెట్టడం లేదా బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకు నెట్టడం ఒక అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేఎల్ రాహుల్ విషయంలో కూడా ఇలాగే చేశారని, ఇప్పుడు సంజూను కూడా అదే విధంగా ట్రీట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని గంభీర్, శ్రేయస్ అయ్యర్ లూప్‌కు ఆకాశ్ చోప్రా సూచించారు.

సంజూ శాంసన్ చేసిన తప్పేంటి?

మొదటి టీ20 తర్వాత గత రెండు మ్యాచ్‌లుగా సంజూ శాంసన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. ఓపెనర్లుగా వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలు బరిలోకి దిగుతుండటంతో సంజూ బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీనిపై ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. “ఒకవేళ మీరు నాలుగో మ్యాచ్‌లో సంజూను జట్టులోకి తెచ్చినా, ప్రస్తుత బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం అతనిని ఎక్కడ ఆడిస్తారు? వైభవ్, అభిషేక్ ఓపెనింగ్ చేసి, ఈషాన్ కిషన్ నెంబర్ 3లో, శ్రేయస్ అయ్యర్ నెంబర్ 4లో వస్తే.. కేవలం కుడిచేతి వాటం బ్యాటర్ కావాలనే కారణంతో సంజూ శాంసన్‌ను నెంబర్ 5 పొజిషన్‌లో ఆడించడం సరైన నిర్ణయం కాదు. అసలు ఇందులో సంజూ చేసిన తప్పేంటి? జట్టులో ఎవరినైనా తీసేయాలంటే మొదట గుర్తొచ్చేది అతనే, అలాగే బ్యాటింగ్ ఆర్డర్ మార్చాలన్నా బలయ్యేది అతనే. నేను ఎప్పుడు సంజూను ఆడించినా మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా ఆడించను, అతని కోసం ఓపెనింగ్ స్థానాన్ని ఖాళీ చేస్తాను. ఎందుకంటే అతను అక్కడే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడు” అని స్పష్టం చేశారు.

మిడిల్ ఆర్డర్‌లో సంజూ ట్రాక్ రికార్డ్ బాలేదు

గణాంకాల పరంగా చూసినా సంజూ శాంసన్‌ను టాప్ ఆర్డర్‌లోనే ఆడించాలని ఆకాశ్ చోప్రా గుర్తు చేశారు. సంజూ శాంసన్ తన కెరీర్‌లో ఆడిన 57 టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో కేవలం 10 సార్లు మాత్రమే నెంబర్ 5 లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ మ్యాచ్‌లలో అతని యావరేజ్ కేవలం 21.13 గా మాత్రమే ఉంది. మొత్తం మీద ఆ పొజిషన్‌లో అతను చేసిన పరుగులు 169 మాత్రమే. దీనిని బట్టి చూస్తే లోయర్ మిడిల్ ఆర్డర్ అనేది సంజూ శాంసన్ శైలికి సరిపోదని, అతనికి ఓపెనింగ్‌లోనే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని ఆకాశ్ చోప్రా డిమాండ్ చేశారు.

వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు మద్దతు

ఇదే సమయంలో జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఫామ్‌పై వస్తున్న విమర్శలను ఆకాశ్ చోప్రా కొట్టిపారేశారు. సంజూ శాంసన్ కోసం తిలక్ వర్మను పక్కన పెట్టాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. “తిలక్ వర్మ మన జట్టుకు వైస్ కెప్టెన్. ఈ సిరీస్‌లో అతని ప్రదర్శన అంత ఘోరంగా ఏమీ లేదు. గత నాలుగు మ్యాచ్‌లను గమనిస్తే అతనికి వచ్చిన అవకాశాలు చాలా తక్కువ. ప్రస్తుతం అతను బ్యాటింగ్ చేస్తున్న పొజిషన్ చాలా కఠినమైనది. అలాంటి స్థానంలో ప్రతి మ్యాచ్‌లోనూ స్థిరంగా రాణించడం ఎవరికైనా కష్టమే. అతని విషయంలో మేనేజ్‌మెంట్ కాస్త ఓపికగా వ్యవహరించాలి. సంజూ శాంసన్‌కు చోటు కల్పించడం కోసం తిలక్ వర్మ స్థానాన్ని మార్చాల్సిన అవసరం లేదు” అని ఆకాశ్ చోప్రా భారత జట్టుకు సలహా ఇచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జట్టులో మార్పులు చేయాల్సి వస్తే మొదట సంజూనే టార్గెట్ చేస్తారా?
జట్టులో మార్పులు చేయాల్సి వస్తే మొదట సంజూనే టార్గెట్ చేస్తారా?
రోజూ ఉదయాన్నే తింటే.. 150 ఏళ్లు బలంగా ఉంటారు! తాతల నాటి సీక్రెట్‌
రోజూ ఉదయాన్నే తింటే.. 150 ఏళ్లు బలంగా ఉంటారు! తాతల నాటి సీక్రెట్‌
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన శ్వేతనాగు
ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన శ్వేతనాగు
ఈ ఫొటోలో ఉన్న ఇద్దరూ.. తెలుగులో క్రేజీ దర్శకులు..
ఈ ఫొటోలో ఉన్న ఇద్దరూ.. తెలుగులో క్రేజీ దర్శకులు..
బ్రాయిలర్ చికెన్ కంటే ఈ మాంసం 10 రెట్లు బెటర్.. అదే కావాలంటూ..
బ్రాయిలర్ చికెన్ కంటే ఈ మాంసం 10 రెట్లు బెటర్.. అదే కావాలంటూ..
కొత్త ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఏపీఎస్‌ఆర్టీసీ క్లారిటీ!
కొత్త ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఏపీఎస్‌ఆర్టీసీ క్లారిటీ!
నెల రోజుల్లో మారనున్న వీరి జాతకం.. కోటీశ్వరులవ్వడం పక్కా..
నెల రోజుల్లో మారనున్న వీరి జాతకం.. కోటీశ్వరులవ్వడం పక్కా..
శని వక్ర గమనం: త్వరలో ఈ రాశులకు గోల్డెన్ డేస్..!
శని వక్ర గమనం: త్వరలో ఈ రాశులకు గోల్డెన్ డేస్..!
సిగరెట్ లేకుండా ఉండలేను.. ఓపెన్ గా చెప్పేసిన టాలీవుడ్ హీరో
సిగరెట్ లేకుండా ఉండలేను.. ఓపెన్ గా చెప్పేసిన టాలీవుడ్ హీరో
'బావి మాత్రమే నీది.. నీళ్లు నావి..' మోసానికి తగిన గుణపాఠం
'బావి మాత్రమే నీది.. నీళ్లు నావి..' మోసానికి తగిన గుణపాఠం