Tollywood: సిగరెట్ లేకుండా ఉండలేను.. ఓపెన్ గా చెప్పేసిన టాలీవుడ్ హీరో
విషయం ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేతత్వం ఈ టాలీవుడ్ హీరోది. యమనసులో ఏదీ దాచుకోడు. అలా తాజాగా తన అలవాట్ల గురించి ఓపెన్ గా చెప్పేశారీ హీరో. సిగరెట్ లేకుండా తాను ఉండలేనంటూ అందరి ముందు ఓపెన్ గా చెప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

సామాన్యులైనా, సెలబ్రిటీలైనా తమ వ్యక్తిగత అలవాట్ల గురించి బయట చెప్పుకోరు. ముఖ్యంగా పొగ త్రాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు ఉన్నా వాటి గురించి బయట చెప్పుకోరు. అందుకు చాలా కారణాలున్నాయి. అయితే ఈ టాలీవుడ్ హీరో డేరింగ్ అండ్ డ్యాషింగ్ అని చెప్పవచ్చు. సమయం ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు. ఎలాంటి ప్రశ్నలు అడిగినా ముక్కుసూటిగా సమాధానం చెబుతాడు. మనసులో ఏదీ దాచుకోడు. అలా తాజాగా తన సినిమా ఈవెంట్ కు హాజరైన ఈ సీనియర్ హీరో తాను సిగరెట్ అలవాటు ఉందని ఓపెన్ గా చెప్పేశాడు. దీంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సోషల్ మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోలు బాగా వైరలవుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? మన జగ్గూభాయ్.
జగపతిబాబు, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం వదలా. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ జగ్గూ భాయ్ తో.. ‘మీ జీవితంలో ఎప్పటికీ వదలలేనిది ఏదైనా ఉందా? అని అడగ్గా.. జగపతిబాబు వెంటనే ‘సిగరెట్’ అని సమాధానం ఇచ్చారు. ఆ వెంటనే యాంకర్ ‘పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం’ అంటూ స్మైల్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా ఇదే కార్యక్రమంలో జగపతి బాబు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ మధ్య చూస్తున్నాం.. కొన్ని సినిమాలను కావాలనే ట్రోలింగ్ చేసి ఆడకూడదు అని టార్గెట్ చేస్తున్నారు.. నాశనం చేయాలని చూస్తున్నారు.. అలాంటి వాటి వల్ల మనమే నాశనం అయిపోతున్నాం. అలాంటి ధోరణి సరైంది కాదు. మనమంతా పాజిటివ్‌గా ఉంటేనే సినిమా ఇండస్ట్రీ మరింత సాఫీగా ముందుకు సాగుతుంది’ అని చెప్పుకొచ్చారు జగ్గూభాయ్.
ఇక సినిమా నిర్మాత తమ్మా రెడ్డి భరద్వాజ కూడా ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘మా టైమ్‌లో సినిమాలు కేవలం ప్రేక్షకుల కోసమే తీసేవాళ్లం. ఇప్పుడు సినిమా తీయడం ఆడియన్స్ కోసమే తీస్తున్నామా అంటే తెలియని పరిస్థితి. ఓటిటికి నచ్చదు.. డిజిటల్‌కు నచ్చదు.. హిందీ డబ్బింగ్ నచ్చదంటున్నారు.. ఎక్కడ చూసినా ప్రేక్షకులే.. మార్కెట్ కోసమే ఇవన్నీ చేస్తున్నాం. ఏ సినిమా అయినా ఆర్నెళ్లలో తీయొచ్చు.. కానీ మూడు నాలుగేళ్లు తీస్తున్నారు.. అది ప్రొడ్యూసర్స్ తప్పా, దర్శకుల తప్పా అంటే చెప్పలేం. చిన్న సినిమాలు మార్కెట్ అవ్వాలంటే పెద్ద సినిమాలు డిక్టేట్ చేస్తున్నారు అంటున్నారు. ముందు సినిమాను నమ్మి తీయాలి. 50 ఏళ్ళ నుంచి నేను వదలా అంటూ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను. మనం సినిమాను నమ్ముకోవాలి.. ప్రేక్షకులను నమ్ముకోవాలి. ఓటిటి, డిజిటల్, శాటిలైట్, హిందీ డబ్బింగ్ కోసం కాకుండా మనకోసం తీద్దాం.. మనం నమ్మింది తీద్దాం. సినిమా అయిపోయాక హీరో వదిలేసి వెళ్తాడు.. కానీ జగపతిబాబు మాత్రం పోవట్లేదు.. ఇంకా ఆడాలి ఆడాలి అని ప్రేమిస్తూనే ఉన్నాడు జగపతిబాబు.నేనొచ్చాక ఎంతోమంది వచ్చారు వెళ్లారు.. నేనిక్కడే ఉన్నాను’ అని చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి.
Question: One thing you cannot miss every day?#JagapathiBabu : CIGARETTE 🚬 pic.twitter.com/J6UhzBA7kT
— Movies4u Official (@Movies4u_Officl) July 9, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




