యూట్యూబ్‏లో రికార్డులు సృష్టిస్తున్న అనుపమ షార్ట్ ఫిల్మ్.. ప్రశంసలు అందుకుంటున్న ‘ఫ్రీడమ్ @ మిడ్‏నైట్’

తెలుగులో 'శతమానం భవతి' సినిమాతో హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత నాగచైతన్య ప్రధాన పాత్రలో

  • Rajitha Chanti
  • Publish Date - 7:45 am, Thu, 28 January 21
యూట్యూబ్‏లో రికార్డులు సృష్టిస్తున్న అనుపమ షార్ట్ ఫిల్మ్.. ప్రశంసలు అందుకుంటున్న 'ఫ్రీడమ్ @ మిడ్‏నైట్'

తెలుగులో శర్వానంద్‏కు జోడీగా ‘శతమానం భవతి’ సినిమాలో హీరోయిన్‏గా  నటించింది అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ‘ప్రేమమ్’ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత అనుపమకు ఆఫర్స్ రావడం నెమ్మదించాయి. ఈ క్రమంలోనే అనుపమ కొత్తగా ఓ షార్ట్ ఫిల్మ్‏లో నటించింది.

‘ఫ్రీడమ్ @ మిడ్ నైట్’ పేరుతో మళయాళంలో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ ఇటీవలె యూట్యూబ్‏లో విడుదలై రికార్డులు సృష్టిస్తుంది. జనవరి 9న యూట్యూబ్‏లో విడుదైలన ఈ షార్ట్ ఫిల్మ్ రికార్డు స్థాయి వ్యూస్‏ని సొంతం చేసుకుంటుంది. విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 5 మిలియన్ వ్యూస్‏ని దక్కించుకుంది. ఒక భార్య తన భర్త నుంచి అర్ద్రరాత్రి జరిగే బలవంతపు శృంగారం నుంచి ఫ్రీడమ్ కోరుకుంటుంది. దీని ఆధారంగానే ఓ ఇంటి ఇల్లాలు ఎదుర్కోనే మానసిక సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ షార్ట్ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ.. రికార్డు స్థాయి వ్యూస్‏ని సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం అనుపమ తెలుగులో నిఖిల్ హీరోగా నటిస్తున్న ’18 పేజెస్’ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీకి సూర్య పల్నాటి దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీవాసు నిర్మిస్తున్నారు.