అసలు రంగమ్మత్త అనసూయ కాదట.. మొదట తననే సంప్రదించారని చెబుతున్న అందాల నటి..

గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలలో హీరోయిన్‌గా నటించిన అందాల నటి రాశి అందరికి గుర్తుండే ఉంటుంది.

అసలు రంగమ్మత్త అనసూయ కాదట.. మొదట తననే సంప్రదించారని చెబుతున్న అందాల నటి..
Follow us
uppula Raju

|

Updated on: Dec 02, 2020 | 5:23 AM

Anasuya is not Rangammatta: గోకులంలో సీత, శుభాకాంక్షలు సినిమాలలో హీరోయిన్‌గా నటించిన అందాల నటి రాశి అందరికి గుర్తుండే ఉంటుంది. తన అందమైన రూపంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కుటుంబ నేపథ్యం గల సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటించారు. మధ్యలో అవకాశాలు తగ్గడంతో నిజం, వెంకీ లాంటి సినిమాలలో ప్రత్యేక గీతాల్లో కూడా నర్తించారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా రాశి, ప్రస్తుతం సినిమా ఆఫర్లు రావడంతో మళ్లీ మేకప్ వేసుకుంటున్నారు. అయితే ఇటీవల రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర గురించి రాశి కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాకు వెల్లడించారు.

అనసూయ భరధ్వాజ చేసిన ఈ క్యారెక్టర్ కోసం మొదటగా చిత్రబృందం తననే సంప్రదించారని చెప్పింది. అయితే ఆ పాత్రలో మోకాళ్ల వరకు చీర కట్టుకోవాలనే కారణంతో ఆ క్యారెక్టర్ వదిలిపెట్టాల్సి వచ్చిందన్నారు. సినిమాలో ఆ పాత్ర నచ్చినప్పటికీ మోకాళ్ల వరకు చీర కట్టుకునే పద్దతి నాకు నప్పదని తిరస్కరించానని వెల్లడించింది. అయితే అనసూయ ఈ క్యారెక్టర్‌లో చాలా బాగా నటించిందని తన అభిప్రాయాన్ని చెప్పింది. అంతేకాకుండా మహేశ్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో గోపిచంద్ లవర్‌గా చేసిన నెగిటివ్ క్యారెక్టర్ కూడా తనకు ఇష్టం లేదని, పరిస్థితుల ప్రభావం వల్లే చేశానని తెలిపింది.