ఆహాలో మరో స్పెషల్.. ఈ వీకెండ్‌కి మరో ఇంట్రస్టింగ్ మూవీ రెడీ

ఆహా ఆడియన్స్‌ కోసం ఈ వీకెండ్‌కి మరో ఇంట్రస్టింగ్ మూవీ రెడీగా వుంది. నిఫా వైరస్ అనే ఈ మలయాళీ మూవీ తెలుగు వెర్షన్‌ ట్రయలర్ రిలీజైంది...

ఆహాలో మరో స్పెషల్.. ఈ వీకెండ్‌కి మరో ఇంట్రస్టింగ్ మూవీ రెడీ

ఆహా ఆడియన్స్‌ కోసం ఈ వీకెండ్‌కి మరో ఇంట్రస్టింగ్ మూవీ రెడీగా వుంది. నిఫా వైరస్ అనే ఈ మలయాళీ మూవీ తెలుగు వెర్షన్‌ ట్రయలర్ రిలీజైంది. కేరళను వణికించిన నిఫా వైరస్ నేపథ్యంతో తీసిన మెడికల్ థ్రిల్లర్ ఇది. డిసెంబర్‌ 4 నుంచి ఆహాలో రిలీజ్ కాబోతోంది. కాగా, నిఫా వైరస్ మూవీ కేరళలోని కొన్ని యధార్థ ఘటనలు మిళితంచేసి రూపొందించిన సినిమా. మాలీవుడ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుందీ మూవీ. అరుదైన, తీవ్రమైన ప్రాణాంతకమైన వైరస్ వ్యాధి అయిన నిపా వైరస్‌ గబ్బిలాలు, పందులు, మనుషులలో ఎవరి నుంచి ఎవరికైనా ఈ వైరస్‌ సోకుతుంది. 1998లో మలేషియాలో మొదటిసారిగా వైరస్‌ కనుగొనబడింది, అటుతర్వాత 2004లో బంగ్లాదేశ్ లోకి వచ్చింది, అనంతరం ఈ వైరస్‌ కేరళలోకి ప్రవేశించి కలకలం రేపింది.