30 weds 21: మళ్లీ అలరించేందుకు సిద్ధమైన 30 వెడ్స్ 21.. రెండో సీజన్ కు రంగం సిద్ధం..

|

Jan 31, 2022 | 6:55 AM

30 వెడ్స్ 21 (30 weds 21).. గతేడాది యూట్యూబ్ లో విడుదలై అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్(Web series) లలో ఇది ఒకటి. 

30 weds 21: మళ్లీ అలరించేందుకు సిద్ధమైన 30 వెడ్స్ 21.. రెండో సీజన్ కు రంగం సిద్ధం..
Follow us on

30 వెడ్స్ 21 (30 weds 21).. గతేడాది యూట్యూబ్ లో విడుదలై అత్యంత ఆదరణ పొందిన వెబ్ సిరీస్(Web series) లలో ఇది ఒకటి.  30 ఏళ్ల  బ్యాచిలర్ కు, 21 ఏళ్ల యువతిని ఇచ్చి వివాహం చేస్తే వారి సంసార జీవితం ఎలా సాగిందన్న కాన్సెప్ట్ తో ఎంతో ఆసక్తికరంగా ఈ సిరీస్ ను రూపొందించారు. చైతన్య రావ్ (Chaitanya Rao), అనన్య (Ananya) జంట నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.  ముఖ్యంగా యూత్ ను బాగా అట్రాక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు రెండో సీజన్‌కి రెడీ అవుతుంది.  సీజన్‌-2 సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను యూనిట్‌ విడుదల చేసింది.  అదేవిధంగా  టీజర్‌ను నేడు (జనవరి31) రిలీజ్ చేయనుంది.  ఈమేరకు ఛాయ్ బిస్కెట్ నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.

‘ఈ వేలంటైన్ నెలలో  మా చూడముచ్చటైన జంట మేఘన (అనన్య), పృథ్వీ(చైతన్య) మిమ్మల్ని మరోసారి కలవడానికి వస్తున్నారు’ అంటూ ఈ సిరీస్ కొత్త పోస్టర్ ను పంచుకున్నారు యూనిట్. ఈ పోస్టర్ లో అనన్య, చైతన్య జోడీ ఎంతో రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. కాగా ఈ రెండో సీజన్ కు అసమర్థుడు, మనోజ్ సంయుక్తంగా కథను అందిస్తున్నారు. జోస్ జిమ్మి సంగీతాన్ని అందించగా.. ప్రత్యక్ష్ రాజు కెమెరామెన్‌గా, తారక్ సాయి ప్రతీక్ ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.


Also Read: NCRTC Jobs: యూజీ/పీజీ అర్హతతో ఎన్సీఆర్టీసీలో వివిధ ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలు తెలుసుకోండి!

Suicide: ఇంటి ముందు అప్పులు ఇచ్చిన వాళ్ల గొడవ.. మనస్తాపానికి గురై ఇంటి యజమాని ఆత్మహత్య..!

Gold, Silver Price Today: దేశంలో పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు..!