‘సైరా’ ను ముగించిన బిగ్ బీ..!
మెగాస్టార్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే తాజా షెడ్యూల్ తో తన పాత్ర తాలూకు షూటింగ్ ను పూర్తి చేశారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఈ చిత్రంలో ఆయన చిరంజీవికి గురువుగా కనిపిస్తుండగా.. నయనతార, జగపతి బాబు, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద […]

మెగాస్టార్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే తాజా షెడ్యూల్ తో తన పాత్ర తాలూకు షూటింగ్ ను పూర్తి చేశారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఈ చిత్రంలో ఆయన చిరంజీవికి గురువుగా కనిపిస్తుండగా.. నయనతార, జగపతి బాబు, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఇక ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హీరో రామ్ చరణ్ నిర్మిస్తుండగా అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వినికిడి.
It’s a WRAP with #BigB…What an amazing and INCREDIBLE journey it has been. Thank you sir for being part of #SyeRaa..Working with you was such a great honor ???? @SrBachchan #MuchRespect #DreamComeTrue pic.twitter.com/uPdsQUtCpt
— SurenderReddy (@DirSurender) March 16, 2019
