‘వ్యక్తిగతంగా నా జీవితంలో ఓ సంఘటన జరిగింది’.. ఆసక్తికర విషయాలను బయటపెట్టిన స్టైలిష్ స్టార్..
'ఆహా' వేదికగా అక్కినేని సమంత వ్యాఖ్యతగా ప్రసారమవుతున్న సామ్‌జామ్ గురించి తెలిసిందే. ఇప్పటికే ఈ షోలో చాలా మంది ప్రముఖ తమ జీవితాలకు సంబంధించిన
‘ఆహా’ వేదికగా అక్కినేని సమంత వ్యాఖ్యతగా ప్రసారమవుతున్న సామ్‌జామ్ గురించి తెలిసిందే. ఇప్పటికే ఈ షోలో చాలా మంది ప్రముఖ తమ జీవితాలకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షోలో పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు. తాజాగా ఈ కార్యక్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. అందులో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సామ్జాబ్ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్ తాను తండ్రయ్యాక ఇంట్లో బూతులు మాట్లాడడం తగ్గించానని నవ్వుతూ చెప్పారు. ‘వ్యక్తిగతంగా నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. అదే నాకు అతిపెద్ద టర్నింగ్ పాయింట్’ అంటూ చెప్పుకొచ్చారు స్టైలిష్ స్టార్. అనంతరం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఇప్పుడైతే బన్ని హార్డ్ వర్కింగ్, క్రమశిక్షణగా ఉంటున్నారు? చిన్నప్పుడు కూడా ఇలాగే ఉండేవారా? అని సమంత అడిగిన ప్రశ్నకు అల్లు అరవింద్ వెంటనే దండం పెట్టేశారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.