AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెబ్ సిరీస్‏లోకి అడుగుపెట్టనున్న ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్.. ఇంట్రెస్టింగ్ కథతో రాబోతున్న బ్యూటీ ?..

ప్రస్తుత పరిస్థితులలో ఓటీటీ వేదికలకు క్రమంగా క్రేజ్ పెరిగిపోతుంది. దానికి అనుగుణంగానే టాలీవుడ్‏తోపాటు, బాలీవుడ్‏కు చెందిన

వెబ్ సిరీస్‏లోకి అడుగుపెట్టనున్న 'ఆర్ఎక్స్ 100' హీరోయిన్.. ఇంట్రెస్టింగ్ కథతో రాబోతున్న బ్యూటీ ?..
ఇప్పుడు మరోసారి తాను ఐటమ్ నంబర్ లో నర్తిస్తోందంటూ ప్రచారం సాగుతుంటే అది తట్టుకోలేక వెంటనే అసలు `నేను ఏ ఐటెమ్ నంబర్ చేయడం లేదు!` అని క్లారిటీ  ఇచ్చింది పాయల్ పాప. 
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2020 | 11:31 AM

Share

ప్రస్తుత పరిస్థితులలో ఓటీటీ వేదికలకు క్రమంగా క్రేజ్ పెరిగిపోతుంది. దానికి అనుగుణంగానే టాలీవుడ్‏తోపాటు, బాలీవుడ్‏కు చెందిన పలువురు సెలబ్రెటీలు ఇప్పటికే వెబ్‏సిరీస్ ద్వారా డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఇప్పడికే హన్సిక, సమంత, కాజోల్ వెబ్ సిరీస్‏ల ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. తాజాగా ఆ జాబితాలోకి మరో హీరోయిన్ చేరింది.

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది పాయల్ రాజపుత్. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో తెలుగులో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఆశించినంతగా అవకాశాలను రాబట్టలేకపోయింది పాయల్. అనంతరం పాయల్ నటించిన ఆర్డిఎక్స్ లవ్ కూడా థియేటర్లలో అంతగా హిట్ కాలేకపోయింది. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమాలో ఐటెం సాంగ్‏లో నటించింది. గతేడాది నాగచైతన్య విక్టరీ వెంకటేష కాంబినేషన్‏లో వచ్చిన మల్టీస్టారర్ వెంకిమామ సినిమాలో వెంకటేష్‏కు జోడిగా నటించింది. తాజా సమాచారం ప్రకారం పాయల్ రాజపుత్ ఓ వెబ్ సిరీస్‏లో నటించనున్నట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ అవినాష్ కోకాటి చెప్పిన కథ పాయల్‏కు నచ్చడంతో.. వెంటనే ఈ వెబ్ సిరీస్ చేయడానికి ఓకే చెప్పినట్లుగా టాక్. అయితే ఇది ఒక ఎమోషనల్ సిరీస్ అని, ఇందులో ప్రధాన పాత్ర మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వెబ్ సిరీస్‏లలో నటిస్తే తమ ప్రతిభను కనబర్చడానికి అవకాశం ఉంటుందని అందుకే ఈ వెబ్ సిరీస్‏కు పాయల్ ఓకే చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది.

Follow Us
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్నారా..? రూ.25 వేల పరిహారం..
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకున్నారా..? రూ.25 వేల పరిహారం..
రాజకీయ ప్రవేశంపై ధనుష్ సరికొత్త ప్లాన్.. ?
రాజకీయ ప్రవేశంపై ధనుష్ సరికొత్త ప్లాన్.. ?
RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా
RRB అసిస్టెంట్ లోకో పైలట్ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా
మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో
మరికొన్ని గంటల్లో తుఫాన్‌గా వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో
సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్‌ఫ్యూజన్
సంజూ ఉంటాడా..వైభవ్ వస్తాడా? చివరి టీ20లో తుది జట్టుపై కన్‌ఫ్యూజన్
ప్రారంభమైన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..
ప్రారంభమైన ఏపీ మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..
ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్‌షిప్
ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon రూ.2 లక్షల స్కాలర్‌షిప్
బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..
బంగారం ధరలు భారీగా తగ్గాయ్.. ఆదివారం రేట్లు ఇవే..
14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!
14వ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్‌ టైప్‌ చేసేలోపే చుక్కలు చూపించిన IAS ..!
ఆసిస్ ఆధిపత్యానికి చెక్.. ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా
ఆసిస్ ఆధిపత్యానికి చెక్.. ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా