‘పుష్ప’ షూటింగ్‌లో బన్నీ.. లుక్ చూశారా..!
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో పుష్ప ఒకటి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం ఇది కాగా..

Allu Arjun Pushpa: టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో పుష్ప ఒకటి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం ఇది కాగా.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. మంగళవారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు అయ్యింది. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇక ఈ షూటింగ్‌లో ప్రధాన పాత్రాదారులు అందరూ పాల్గొనగా.. దాదాపు నెల రోజుల పాటు చిత్రీకరణ జరగనుంది. కాగా ఈ మూవీలో అల్లు అర్జున్ కొత్త లుక్‌లో కనిపించనుండగా.. షూటింగ్‌లో బన్నీ లుక్ లీక్ బయటకు వచ్చింది. ( ఏడు అడుగుల ధనియాల మొక్క.. గిన్నెస్ రికార్డు సాధించిన రైతు)
కాగా ఈ మూవీలో బన్నీ చిత్తూరు జిల్లాకు చెందిన లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన రష్మిక మొదటిసారి జత కట్టబోతోంది. జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ముత్తం శెట్టి క్రియేషన్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ( ఎస్వీబీసీలో పోర్న్ సైట్ లింక్ కలకలం.. వారందరిపై కఠిన చర్యలకు సిద్ధం)