ముదురుతున్న తండ్రి – కొడుకు(హీరో విజయ్) మధ్య గొడవలు
తమిళనాడులో హీరో విజయ్, ఆయన తండ్రి మధ్య గొడవలు మరింత ముదురుతున్నాయి. తాజాగా విజయ్ అభిమాన సంఘాల తీర్మానాలతో వీరిద్ధరి మధ్య వివాదం పరాకాష్టకు చేరింది. కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ అనుమతి లేకుండా ఆయన తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్, విజయ్ పేరు మీద రాజకీయ పార్టీ ఏర్పాటుకి ఎన్నికల కమిషన్ కి నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తండ్రి చర్యలను హీరో విజయ్ పూర్తిగా తప్పుబట్టాడు. తనకి, తన తండ్రి పెట్టనున్న […]
తమిళనాడులో హీరో విజయ్, ఆయన తండ్రి మధ్య గొడవలు మరింత ముదురుతున్నాయి. తాజాగా విజయ్ అభిమాన సంఘాల తీర్మానాలతో వీరిద్ధరి మధ్య వివాదం పరాకాష్టకు చేరింది. కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ అనుమతి లేకుండా ఆయన తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్, విజయ్ పేరు మీద రాజకీయ పార్టీ ఏర్పాటుకి ఎన్నికల కమిషన్ కి నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తండ్రి చర్యలను హీరో విజయ్ పూర్తిగా తప్పుబట్టాడు. తనకి, తన తండ్రి పెట్టనున్న రాజకీయపార్టీకి సంబంధం లేదని వెల్లడించాడు. ఈ క్రమంలో నిన్న 30 జిల్లాలకు చెందిన జిల్లా అధ్యక్షులతో, జిల్లా కార్యకర్తలతో విజయ్ అత్యవసర భేటీ జరిపాడు. ఈ సమావేశంలో తన తండ్రి పెట్టనున్న రాజకీయపార్టీకి దూరంగా ఉండాలని సూచించడంతో ఆయా జిల్లాలలో అభిమాన సంఘాలు సమావేశాలు నిర్వహించాయి. మదురై జిల్లాలో జరిగిన విజయ్ మక్కళ్ ఇయక్కం సమావేశంలో విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ రాజకీయ పార్టీలో ఎవరూ చేరకూడదని అభిమానులు తీర్మానం చేసి నెరవేర్చారు. నటుడు విజయ్ అనుమతి లేకుండా ఎవరూ రాజకీయ వివాదాలలో పాల్గొనకూడదని, విజయ్ మక్కళ్ ఇయక్కంలోనే కొనసాగుతామని అభిమాన సంఘాల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.