అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో’ మూవీ రివ్యూ

చిత్రం: అల వైకుంఠపురములో రచన – దర్శకత్వం: త్రివిక్రమ్‌ నిర్మాత: అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నటీనటులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, టబు, జయరామ్‌, సుశాంత్‌, నవదీప్‌, నివేదా పేతురాజ్‌, సముద్రఖని తదితరులు సంగీతం: తమన్‌.ఎస్‌. కెమెరా: పి.యస్‌.వినోద్‌ ఎడిటింగ్‌: నవీన్‌ నూలి నిర్మాణం: గీతా ఆర్ట్స్, హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్ విడుదల: 12.01.2020 అల్లు అర్జున్‌ హీరోగా, త్రివిక్రమ్‌ డైరక్షన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘అల వైకుంఠపురములో’ ఎలా ఉండబోతోంది? తమన్‌ మ్యూజిక్‌ […]

అల్లు అర్జున్‌  'అల వైకుంఠపురములో' మూవీ రివ్యూ
Follow us

|

Updated on: Jan 14, 2020 | 4:40 PM

చిత్రం: అల వైకుంఠపురములో రచన – దర్శకత్వం: త్రివిక్రమ్‌ నిర్మాత: అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నటీనటులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, టబు, జయరామ్‌, సుశాంత్‌, నవదీప్‌, నివేదా పేతురాజ్‌, సముద్రఖని తదితరులు సంగీతం: తమన్‌.ఎస్‌. కెమెరా: పి.యస్‌.వినోద్‌ ఎడిటింగ్‌: నవీన్‌ నూలి నిర్మాణం: గీతా ఆర్ట్స్, హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్ విడుదల: 12.01.2020 అల్లు అర్జున్‌ హీరోగా, త్రివిక్రమ్‌ డైరక్షన్‌లో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం ‘అల వైకుంఠపురములో’ ఎలా ఉండబోతోంది? తమన్‌ మ్యూజిక్‌ చేసిన పాటలేమో వందల మిలియన్ల లైకులు తెచ్చుకున్నాయి.. మరి సినిమాకు ఆ టాక్‌ వస్తుందా? అటు బన్నీతో, ఇటు త్రివిక్రమ్‌తో పూజా హెగ్డే పని చేసిన గత చిత్రాలు హిట్‌ అయ్యాయి. ఆ సెంటిమెంట్‌ ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి వర్కవుట్‌ అవుతుందా?… ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఆదివారం ఆన్సర్‌ దొరికేసింది. ఏంటి ఆ ఆన్సర్‌? ‘అల వైకుంఠపురములో’ ఎలా ఉంది? చదివేద్దాం…

కథ రామచంద్ర (జయరామ్‌) దగ్గర క్లర్క్ గా పనిచేస్తుంటాడు వాల్మీకి (మురళీశర్మ). వాళ్లిద్దరి భార్యలకు ఒకే హాస్పిటల్‌లో ఒకే రోజు మగపిల్లలు జన్మిస్తారు. జయరామ్‌ భార్య అంజలి (టబు)కి పుట్టిన బిడ్డ కాసేపు ఉలకడు. పలకడు. దాంతో అక్కడున్న నర్సు (ఈశ్వరీ రావు) కంగారు పడుతుంది. ఆ విషయాన్ని వాల్మీకికి చెబుతుంది. వాల్మీకి కుటిల బుద్ధితో బిడ్డలను మారుస్తాడు. నర్సు కోమాలోకి వెళ్లడానికి కారణమవుతాడు. తన బిడ్డ యజమాని ఇంట్లో పెరగాలనుకుంటాడు. అక్కడ తన కుమారుడికి రాజు అని పేరు పెట్టించి, తన దగ్గర పెరిగే పిల్లాడికి బంటు అని పేరు పెడతాడు. అయితే పాతికేళ్ల తర్వాత ఆ విషయం వాల్మీకి దగ్గర పెరుగుతున్న కొడుకు బంటు (అల్లు అర్జున్‌)కి తెలుస్తుంది. అప్పటికే రామచంద్ర కుటుంబానికి అమూల్య (పూజా హెగ్డే) ద్వారా పరిచయమై ఉంటాడు బంటు. రామచంద్ర కుమారుడిగా పెరుగుతున్న రాజు (సుశాంత్‌) గురించి తెలుసుకుంటాడు. అతనితో పాటు ఆ కుటుంబం ఉన్న పరిస్థితులను గురించి కూడా అర్థం చేసుకుంటాడు. తన తండ్రి రామచంద్ర(జయరామ్‌)ని ఇబ్బంది పెడుతున్న అప్పలనాయుడు (సముద్రఖని)తోనూ, అతని కుమారుడు పైడితల్లి (గోవింద్‌ పద్మసూర్య)తోనూ తలపడుతాడు. ఆ తర్వాత ఏమైంది? రామచంద్ర భార్య అంజలికి ఈ విషయమంతా తెలుసా? రామచంద్రకు, అంజలికి మధ్య ఉన్న మనస్పర్థలేంటి? వాల్మీకికి పాతికేళ్లుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన అంశానికి ఫైనల్‌గా దొరికిన సమాధానం ఏంటి? వంటివన్నీ సస్పెన్స్.

ప్లస్‌ పాయింట్లు – త్రివిక్రమ్‌ మాటలు – పాటలు – విజువల్స్ – నటీనటుల పెర్ఫార్మెన్స్ – కామెడీ

మైనస్‌ పాయింట్లు – ఊహకు అందే కథ – సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు

సమీక్ష ఫస్ట్ నుంచీ కాన్పిడెంట్‌గానే ఉంది ‘అల వైకుంఠపురములో’ టీమ్‌. దానికి తోడు అల్లు అర్జున్‌ కాస్త గ్యాప్‌ తర్వాత వస్తున్నారు కాబట్టి ప్రమోషన్ల లోనూ యాక్టివ్‌గా పాల్గొన్నారు. వీటన్నిటి కన్నా ముందు సినిమాపై అంచనాలు పెంచింది తమన్‌ మ్యూజిక్‌. ప్రతి పాటా విడుదలైన కొద్దీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేయసాగింది. అలా పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే ఉంది సినిమా. కథగా చూస్తే చాలా సింపుల్‌గా అనిపిస్తుంది. కానీ అటు డబ్బున్న వాళ్ల ఇంట్లోనూ, ఇటు మధ్య తరగతి ఫ్యామిలీలోనూ ఉన్న ఎమోషన్స్ ని చాలా చక్కగా క్యాప్చర్‌ చేసే ప్రయత్నం చేశారు త్రివిక్రమ్‌. తన కొడుక్కి కచ్చితంగా ‘ఇలాంటి లక్షణాలు ఉంటాయి’ అని అనుకునే తండ్రి ఒకవైపు, ఎక్కడున్నా తన కొడుకు సుఖంగా ఉంటే చాలనుకునే తండ్రి మరో వైపు ఇందులో ప్రధానంగా కనిపిస్తారు. కొన్ని సందర్భాల్లో తెలిసో తెలియకో కొందరు ప్రలోభాలకు తలొగ్గుతారు. వాటి నుంచి బయటపడి, అయినవారికి దగ్గరయ్యే క్రమంలో వారితో మాటలకు కూడా నోచుకోరు. తప్పు చేసిన భర్త మనస్ఫూర్తిగా భార్యను క్షమించమని అడగటానికి కాళ్లు పట్టుకున్నా తప్పులేదనే విషయాన్ని చాలా అందంగా చూపించారు త్రివిక్రమ్‌. ఆయన డిజైన్‌ చేసిన బంటు కేరక్టర్‌కి అచ్చు గుద్దినట్టు సరిపోయారు అల్లు అర్జున్‌. అసలే స్టైలిష్‌ స్టార్‌… ఇంకాస్త స్టైలిష్‌ పెర్ఫార్మెన్స్, డ్యాన్సులతో స్క్రీన్‌ మీద ఫైర్‌ పుట్టించేశారు. ఫైట్లు కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్‌గా డిజైన్‌ చేశారు. ప్రతి ఫైటూ బావుంది. సామజవరగమన, రాములో రాములా, బుట్టబొమ్మ పాటలు స్క్రీన్‌ మీద చూడ్డానికి ప్లెజెంట్‌గా అనిపించాయి. పూజా హెగ్డే ఇంట్రడక్షన్‌ సీన్‌ మాస్‌కి ఫీస్టే. మురళీశర్మ కొత్త మ్యానరిజమ్‌తో కనిపించారు. తనికెళ్ల భరణి క్యారక్టర్‌ని స్పెషల్‌గా మెన్షన్‌ చేయాల్సిందే. అప్పల్నాయుడుగా సముద్రఖని పర్ఫెక్ట్ గా సరిపోయారు. క్లైమాక్స్ ఫైట్‌లో వచ్చే గీతం కొత్తగా ఉంది. తెలుగు స్క్రీన్‌ మీద ఎవర్‌గ్రీన్‌ హిట్‌ కాన్సెప్ట్ సూపర్‌హిట్‌ సాంగ్స్ అంత్యాక్షరి. దాన్ని ఇందులో కొత్తగా వాడుకున్నారు. పవర్‌స్టార్‌, మెగాస్టార్‌ పాటలు, అక్కినేని, రాజశేఖర్‌ని ఇమిటేట్‌ చేసే షాట్స్ బావున్నాయి. ఫ్యాన్స్ ని కొట్టకూడదు అనే డైలాగ్ వచ్చినప్పుడు థియేటర్లో విజిల్స్ వినిపించాయి. కెమెరా రిచ్‌గా కనిపించింది. త్రివిక్రమ్‌ – బన్నీ గత చిత్రాలు జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి… తండ్రి విలువను చెప్పినవే. ఈ చిత్రంలోనూ తండ్రి విలువను చెప్పారు. అంతకు మించి కొడుకు బాధ్యతను గుర్తు చేశారు త్రివిక్రమ్‌. కంటెంట్‌ ప్లస్‌ ప్లానింగ్‌ ఉన్న డైరక్టర్‌కి పర్ఫెక్ట్ హీరో దొరికితే సినిమా హిట్‌ ఖాయమని మూడో సారి ప్రూవ్‌ అయింది. పండక్కి ఎమోషన్స్ ఉన్న క్లాస్‌ మూవీ అల వైకుంఠపురములో.. ఫైనల్‌గా… అల వైకుంఠపురములో… స్టైలిష్‌గా ఉంది! – డా. చల్లా భాగ్యలక్ష్మి

భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??