రిపీట్ అవుతున్న ‘హిట్’ కాంబో..?

రిపీట్ అవుతున్న ‘హిట్’ కాంబో..?

హిట్ కాంబో రిపీట్ అవ్వబోతోంది. అక్కినేని వారసుడు నాగచైతన్యతో మెగా నిర్మాత అల్లు అరవింద్ మరో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహించనున్నాడట. ఇప్పటికే సినిమా కథ గురించి అల్లు అరవింద్‌తో నాగ చైతన్య చర్చించారని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. కాగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇదివరకు ‘100%’లవ్ చిత్రం వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి […]

TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:12 PM

హిట్ కాంబో రిపీట్ అవ్వబోతోంది. అక్కినేని వారసుడు నాగచైతన్యతో మెగా నిర్మాత అల్లు అరవింద్ మరో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహించనున్నాడట. ఇప్పటికే సినిమా కథ గురించి అల్లు అరవింద్‌తో నాగ చైతన్య చర్చించారని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

కాగా ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇదివరకు ‘100%’లవ్ చిత్రం వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు అఖిల్‌తోనూ అల్లు అరవింద్ ఓ మూవీని తెరకెక్కించబోతున్నట్లు టాక్. ఈ మూవీకి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించబోతున్నాడట. మరి వీటిలో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu