త్వరలో అడవి శేష్ ‘మేజర్’ ఫస్ట్ లుక్ పోస్టర్.. విడుదల డేట్‌ను ప్రకటించిన చిత్రయూనిట్..
థ్రిలర్ అండ్ సస్పెన్స్ సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేష్ నటిస్తున్న కొత్త సినిమా 'మేజర్'. గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రాన్ని
థ్రిలర్ అండ్ సస్పెన్స్ సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేష్ నటిస్తున్న కొత్త సినిమా ‘మేజర్’. గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్స్‌లో ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యుటీ సైఈ మంజ్రేకర్, శోభితా దూళిపాళ్ళ నటిస్తున్నారు. ప్రముఖ జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏప్లస్ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ పతాకాలపై ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు.
డిసెంబర్ 17న హీరో అడవి శేట్ పుట్టిన రోజు కావడంతో ఆ రోజు ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. ఇటీవల విడుదలైన లుక్ టెస్ట్‌కు భారీగానే స్పందన వచ్చింది. కాగా డిసెంబర్ 17 ఉదయం 10 గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
#MajorBeginnings – After the overwhelming response for ‘The Look’ Test, we’re excited to show you The First Look on 17th Dec @ 10 AM.#MajorTheFilm @AdiviSesh @sobhitaD @saieemmanjrekar @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @vivekkrishnani @sonypicsprodns pic.twitter.com/E4UvzRasgf
— GMB Entertainment (@GMBents) December 15, 2020