Bigg Boss 4 : అతడితో బ్రేకప్ అవ్వడం వల్లే సౌత్ సినిమాలకు దూరమయ్యాను : మోనాల్ గజ్జర్

బిగ్ బాస్ హౌస్ లో ఆటతోపాటు అందంతోను ఆకట్టుకున్న బ్యూటీ మోనాల్. ఈ భామ కోసమే బిగ్ బాస్ చూసే వాళ్ళుకూడా ఉన్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ హౌస్ లో అభిజీత్

Bigg Boss 4 : అతడితో బ్రేకప్ అవ్వడం వల్లే సౌత్ సినిమాలకు దూరమయ్యాను : మోనాల్ గజ్జర్
Follow us

|

Updated on: Dec 15, 2020 | 8:53 PM

బిగ్ బాస్ హౌస్ లో ఆటతోపాటు అందంతోనూ ఆకట్టుకున్న బ్యూటీ మోనాల్ గజ్జర్ . ఈ భామ కోసమే బిగ్ బాస్ చూసే వాళ్ళుకూడా ఉన్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ హౌస్ లో అభిజీత్, అఖిల్ తో క్లోజ్ గా ఉండటంతో హైలెట్ అయ్యింది. ఇక హౌస్ లో 14 వారాల పాటు కంటిన్యూ అయిన మోనాల్ గత ఆదివారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో అభిజీత్ తో క్లోజ్ గా ఉన్న ఈ అమ్మడు, ఆతర్వాత అభికి దూరమై అఖిల్ కు దగ్గరైంది. అఖిల్ కు మోనాల్ చాలా క్లోజ్ అయ్యింది.  క్షణమైనా విడిచి ఉండలేనంతగా ఈ అమ్మడు అతనితో చెట్టాపట్టాలేసుకు తిరిగింది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈ అమ్మడిని కావాలనే ఇన్నిరోజులు కొనసాగించారని కొందరు అంటున్నారు. బిగ్ బాస్ నిర్వాహకుల చొరవతోనే మోనాల్ ఇన్ని వారాలు కంటిన్యూ అయిందని అంటున్నారు. ఇక బయటకు వచ్చిన మోనాల్ ఇంటర్యూలతో బిజీ అయ్యింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌత్ కు దూరం అవ్వడానికి కారణం చెప్పుకొచ్చింది. తెలుగులో సినిమాలు చేస్తున్న సమయంలోనే మలయాళంలో సినిమా ఛాన్స్ వచ్చింది. నాకు కల్చర్స్  నేర్చుకోవడం అంటే ఇష్టం, వేరే భాషలో సినిమా చేస్తే మరింత నేర్చుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో ఆ సినిమా ఒప్పుకున్నాను. ఆ సమయంలోనే ఓ మలయాళీ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కొంతకాలం రిలేషన్ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరం విడిపోయాం. అతను సౌత్ ఇండియన్ కాబట్టి  మళ్ళీ సౌత్ కు రాలేదు ..ఇక్కడ సినిమాలు చేయలేదు. ఆతర్వాత వరుసగా గుజరాతీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. లవ్ బ్రేకప్ అవ్వడం వల్లే సౌత్ సినిమాలకు దూరమయ్యానని మోనాల్ చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ తర్వాత ఈ అమ్మడికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మరి ఇప్పుడు తెలుగులో ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.