AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trisha: త్రిష రాజకీయాల్లోకి రానుందా.? చెన్నై చిన్నది పొలిటికల్‌ ఎంట్రీపై ఆమె తల్లి సమాధానం ఏంటంటే..

Trisha: నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార త్రిష. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 23 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ తనదైన అందంతో ఆకట్టుకుంటోందీ బ్యూటీ. ఇప్పటికీ ఆఫర్లను సొంతం చేసుకుంటూ...

Trisha: త్రిష రాజకీయాల్లోకి రానుందా.? చెన్నై చిన్నది పొలిటికల్‌ ఎంట్రీపై ఆమె తల్లి సమాధానం ఏంటంటే..
Trisha
Narender Vaitla
|

Updated on: Aug 24, 2022 | 7:44 PM

Share

Trisha: నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది అందాల తార త్రిష. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 23 ఏళ్లు గడుస్తోన్నా ఇప్పటికీ తనదైన అందంతో ఆకట్టుకుంటోందీ బ్యూటీ. ఇప్పటికీ ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అందాల తార రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని ఓ వార్త వైరల్‌ అయ్యింది. ఇప్పటికీ అడపాదడపా సినిమాల్లో నటిస్తోన్న త్రిష సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టనుందని, కాంగ్రెస్‌ పార్టీ ద్వారా తెరంగేట్రం చేయనుందని వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా వైరల్‌ అవుతోన్న ఈ వార్తపై త్రిష తల్లి స్పందించారు. తన కూతురు పొలిటికల్‌ ఎంట్రీపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రిష తల్లి ఉమా కృష్ణన్‌ అసలు విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం త్రిష ఫోకస్‌ మొత్తం సినిమాలపైనే ఉందని, రాజకీయాలనే ఆలోచనే లేదని తెలిపారు. తమిళ్‌తో పాటు పలు ఇతర భాషల్లోనూ నటించేందుకు త్రిష సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.

ఇక త్రిష కూడా తన రాజకీయ వార్తలను ఖండించినట్లు తెలుస్తోంది. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో తెలియడం లేదన్న త్రిష.. తనకు రాజకీయాల్లో చేరాలన్న ఆలోచన లేదని తేల్చిచెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై త్రిష ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం స్పందించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్