Viral Photo: ఈ ఫోటోలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఉంది.. ఎవరో గుర్తుపట్టండి..

గతంలో గ్లామరస్ షోలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హద్దులు చేరిపేస్తుంది. ఇటీవల ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎవరో గుర్తుపట్టండి.

Viral Photo: ఈ ఫోటోలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఉంది.. ఎవరో గుర్తుపట్టండి..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 24, 2022 | 7:45 PM

పైన ఫోటోలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఉంది. ఎవరో గుర్తుపట్టండి. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ చిన్నది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ సరసన ఈ అమ్మడు నటించిన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అలాగే రవితేజ, రాజశేఖర్, శ్రీకాంత్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ హీరోయిన్. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన ఈ అమ్మడు.. లేటేస్ట్ ఫోటోలతో నెట్టింటిని షేక్ చేస్తుంది. గతంలో గ్లామరస్ షోలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హద్దులు చేరిపేస్తుంది. ఇటీవల ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎవరో గుర్తుపట్టండి.

ఆ అందాల తార మరెవరో కాదు.. హీరోయిన్ మీరా జాస్మిన్. అమ్మాయి బాగుంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత భద్ర, గుడుంబా శంకర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. 2014లో దుబాయ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ జాన్ టైటస్ ను వివాహం చేసుకున్న ఆమె.. ఆతర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే ఇటీవల గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్‏లో ఉంటుంది. దీంతో మీరా జాస్మిన్ తిరిగి రీఎంట్రీ ఇస్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.