AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా భార్యను చేతబడి చేసి చంపేశారు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ భర్త

ఆమె ఓ క్రేజీ హీరోయిన్.. ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి.. కానీ ఊహించని విధంగా గుండెపోటుతో ఈలోకాన్ని విడిచివెళ్లిపోయింది. ఆమె మరణంతో సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. అలాగే ఆమె భర్త కన్నీరుమున్నీరు అయ్యాడు. చిన్న వయసులోనే ఆమె మరణం ఇండస్ట్రీని కుదిపేసింది.

నా భార్యను చేతబడి చేసి చంపేశారు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ భర్త
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 20, 2026 | 4:59 PM

Share

గత ఏడాది సినిమా ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి. కొందరు ప్రముఖులు కన్నుమూయడంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. అలాగే ఓ హీరోయిన్ కూడా అనూహ్యంగా గత ఏడాది కన్నుమూసింది. చిన్న వయసులోనే ఆమె మరణించడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆమె అభిమానులు కన్నీరు మున్నీరు అయ్యరు. ఇక ఆమె భర్తకు గుండె పగిలినంత పనైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆమె ఒక్కసారిగా ఈ లోకం విడిచి వెళ్లిపోవడంతో ఆయన ఎంతో ఏడ్చాడు. ఇప్పుడు ఆమె జ్ఞాపకాల్లో జీవిస్తున్నాడు. ఇంతకూ ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ నటి షెఫాలి జరివాలా. ‘కాంటా లగా..’ పాటతో ఫేమస్‌ అయ్యింది ఈ నటి..

200లకు పైగా సినిమాలు.. కనీసం చివరి చూపుకు కూడా సినిమావాళ్లు రాలేదు

షెఫాలి జరివాలా 2025 జనవరి 27న కన్నుమూసింది. కాగా ఆమె గుండెపోటుతో మరణించింది. షెఫాలి.. బ్యూటీ ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఒక రోజంతా ఉపవాసం ఉండి.. అదే రోజు ఓ పవర్ ఫుల్ ఇంజక్షన్‌ తీసుకుందని.. దాని ప్రభావంతో కాసేపటికే గుండెపోటుతో మరణించిందని అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆమె భర్త పరాగ్‌ కొట్టిపారేశారు. ఇక ఇప్పుడు ఆమె పై చేతబడి చేశారని అంటున్నాడు పరాగ్‌.

ఇవి కూడా చదవండి

ఆ హీరో ఉత్త అమాయకుడు, మంచివాడు.. ఏది చెప్పిన చేసేవాడు.. ఆసక్తికర విషయం చెప్పిన తేజ

తన భార్య పై చేతబడి చేశారని.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పరాగ్‌ మాట్లాడుతూ.. దేవుడు ఉన్నదంటే దెయ్యం కూడా ఉంటుంది. అది నేను నమ్ముతాను..చేతబడులు జరుగుతున్నాయి. నా భార్య పై చేతబడి చేశారు. ఎవరు చేశారో.? ఎందుకు చేశారో నాకు తెలియదు. కానీ చేతబడి జరిగింది. ఒకసారి కాదు రెండు సార్లు మా పై చేతబడి జరిగింది. మొదటిసారి జరిగినప్పుడు పరిస్థితులు వాటంతట అవే సర్దుకున్నాయి. ఆతర్వాత పరిస్థితులు దారుణంగా మారాయి. నేను చెడు శక్తులను ఎంతో కొంత పసిగట్టగలను.. నా భార్యను తాకినప్పుడు నాకు ఎదో చేడు జరుగుతుందని అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ పాట వింటే కన్నీళ్లు ఆగవు.. సాంగ్ వచ్చి 31 ఏళ్లు.. ఇప్పటికీ అదే ఫీల్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..