AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

U19 World Cup 2026: చిచ్చరపిడుగుల ఊచకోత..వరల్డ్ కప్‌లో అగ్రస్థానంలో టీమిండియా

U19 World Cup 2026: జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత కుర్రాళ్లు దుమ్మురేపుతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతూ సూపర్-6 బెర్త్‌ను ఖాయం చేసుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించారు. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆయుష్ కెప్టెన్సీలోని టీమిండియా 18 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

U19 World Cup 2026: చిచ్చరపిడుగుల ఊచకోత..వరల్డ్ కప్‌లో అగ్రస్థానంలో టీమిండియా
U 19 World Cup 2026
Rakesh
|

Updated on: Jan 20, 2026 | 4:50 PM

Share

U19 World Cup 2026: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2026లో భారత యువ జట్టు విజయ యాత్ర కొనసాగిస్తోంది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆయుష్ కెప్టెన్సీలోని టీమిండియా 18 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత్ అధికారికంగా సూపర్-6 దశకు చేరుకుంది. ఈ టోర్నీలో సూపర్-6కు అర్హత సాధించిన మొదటి జట్టుగా భారత్ నిలిచింది. అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో అమెరికాను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్, ఇప్పుడు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి గ్రూప్-బిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు తలపడుతున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించగా, ప్రతి గ్రూపు నుంచి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-6కు వెళ్తాయి. ప్రస్తుతం భారత్ ఉన్న గ్రూప్-బిలో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉండగా, అమెరికా మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ తన మొదటి మ్యాచ్‌లో ఓడిపోయి చివరి స్థానంలో ఉంది. భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడం విశేషం.

మిగిలిన గ్రూపుల విషయానికి వస్తే.. గ్రూప్-ఏలో శ్రీలంక, గ్రూప్-సిలో ఇంగ్లండ్, గ్రూప్-డిలో ఆఫ్ఘనిస్తాన్ తమ ఆధిపత్యాన్ని చాటుతున్నాయి. ఆశ్చర్యకరంగా గ్రూప్-డిలో బలమైన దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల కంటే ఆఫ్ఘనిస్తాన్ ముందంజలో ఉంది. పాకిస్తాన్ గ్రూప్-సిలో ఇంగ్లండ్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత జట్టు తదుపరి మ్యాచ్‌లలో ఇదే ఫామ్ కొనసాగిస్తే, ఆరోసారి టైటిల్ గెలవడం కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

చిచ్చరపిడుగుల ఊచకోత..వరల్డ్ కప్‌లో అగ్రస్థానంలో టీమిండియా
చిచ్చరపిడుగుల ఊచకోత..వరల్డ్ కప్‌లో అగ్రస్థానంలో టీమిండియా
అదృష్టం అంటే ఇదేనేమో.. 1 లక్ష రూపాయలు ఇప్పుడు రూ 52 లక్షలు
అదృష్టం అంటే ఇదేనేమో.. 1 లక్ష రూపాయలు ఇప్పుడు రూ 52 లక్షలు
కాంట్రవర్శీకి రెహమాన్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టేసినట్టేనా ??
కాంట్రవర్శీకి రెహమాన్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టేసినట్టేనా ??
ట్రిపుల్‌ ఆర్‌ హీరోలతో గురూజీ.. ప్లానింగ్‌ పెద్దదే
ట్రిపుల్‌ ఆర్‌ హీరోలతో గురూజీ.. ప్లానింగ్‌ పెద్దదే
తమ్ముడిని మించిన అన్న.. అదరహో అనిపిస్తున్న వరప్రసాద్ రికార్డులు
తమ్ముడిని మించిన అన్న.. అదరహో అనిపిస్తున్న వరప్రసాద్ రికార్డులు
చలాన్ వసూళ్లపై ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక అదేశాలు!
చలాన్ వసూళ్లపై ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక అదేశాలు!
శ్రీలీల భారీ ప్లానింగ్‌.. టాలీవుడ్‌కి దూరమవుతున్నారా
శ్రీలీల భారీ ప్లానింగ్‌.. టాలీవుడ్‌కి దూరమవుతున్నారా
కటౌట్‌తో పనేంటి ?? కంటెంట్ ఉంటే చాలు.. హిట్టు పక్కా
కటౌట్‌తో పనేంటి ?? కంటెంట్ ఉంటే చాలు.. హిట్టు పక్కా
వారణాసి తర్వాతేంటి ?? సస్పెన్స్ లో సూపర్‌స్టార్‌ నెక్స్ట్ సినిమా
వారణాసి తర్వాతేంటి ?? సస్పెన్స్ లో సూపర్‌స్టార్‌ నెక్స్ట్ సినిమా
ఈ హీరోయిన్ గోల్డ్ స్మగ్లర్.. ఆమె తండ్రేమో ఏకంగా అమ్మాయిలతో అలా..
ఈ హీరోయిన్ గోల్డ్ స్మగ్లర్.. ఆమె తండ్రేమో ఏకంగా అమ్మాయిలతో అలా..